అమెరికాలో భారతీయ విద్యార్ధి దారుణ హత్య .. పిల్లలను విదేశాలకు పంపాలంటే వణుకుతున్న తల్లిదండ్రులు

అమెరికాలో ఇటీవల నిరాశ్రయుడి హత్యకు గురైన భారత్‌కు చెందిన వివేక్ సైనీ( Vivek Saini ) ఘటన నేపథ్యంలో హర్యానాలోని పంచకుల( Panchkula ) సమీపంలోని భగవాన్‌పూర్ గ్రామ నివాసితులు విదేశాలలో వున్న తమ పిల్లల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వివేక్ హత్య విద్వేషపూరిత నేరమని అతని బంధువులు పేర్కొన్నారు.

 Panchkula Residents Concerned Over Safety Of Children Abroad Details, Panchkula-TeluguStop.com

వివేక్ తన బ్యాచిలర్ డిగ్రీని 2022లో పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికా( America ) వెళ్లాడు.అతను తెలివైన విద్యార్ధి అని.అమెరికాలోని తన కళాశాలలో టాపర్‌గా నిలిచాడని బంధువులు తెలిపారు.జనవరి 23న భారత్‌కు తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ వుండగా.

ఇంతలో ఈ దారుణం చోటు చేసుకుంది.

Telugu America, Haryana, Indian, Panchkula, Safety, Sandal Singh, Usa Gun, Vivek

ఇది విద్వేషపూరిత నేరమని వివేక్ తాతయ్య సందల్ సింగ్( Sandal Singh ) ఆవేదన వ్యక్తం చేశారు.మా బాబు .మానవత్వంతో నిరాశ్రయుడికి( Homeless Man ) ఆహారం, ఆశ్రయం కల్పించాడని కానీ ఆ దుర్మార్గుడు వివేక్‌ను కొట్టి చంపాడని పేర్కొన్నారు.ఈ ఘటన నేపథ్యంలో గ్రామానికి చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను విదేశాలకు పంపడానికి భయపడుతున్నారని సందల్ సింగ్ వ్యాఖ్యానించారు.వివేక్ సైనీ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఓ కుటుంబం తమ గ్రామాన్ని సందర్శించిందని, తమ బిడ్డను ఉపాధి కోసం అమెరికాకు తిరిగి పంపకూడదని నిర్ణయించుకున్నామన్నారు.

పాశ్చాత్య దేశాలలో హింస, తుపాకీ సంస్కృతికి ప్రజలు ఇప్పుడు భయపడుతున్నారని సందల్ సింగ్ తెలిపారు.వివేక్ మృతదేహం భారత్‌కు వచ్చినప్పుడే , చండీగఢ్‌కు( Chandigarh ) చెందిన మరో యువకుడు అమెరికాలో హత్యకు గురై అతని భౌతికకాయం కూడా స్వదేశానికి చేరుకుందని ఆయన వెల్లడించారు.

Telugu America, Haryana, Indian, Panchkula, Safety, Sandal Singh, Usa Gun, Vivek

వివేక్ సైనీ హత్య నేపథ్యంలో గ్రామస్తుల నుంచి తమ కుటుంబానికి అపారమైన సహాయం అందిందని సందల్ సింగ్ చెప్పారు.వివేక్ స్నేహితులు యూఎస్‌లోని ఒక ఎన్‌జీవో( NGO ) ద్వారా అతని మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు కావాల్సిన చట్టబద్ధమైన లాంఛనాలను పూర్తి చేశారని పేర్కొన్నారు.గ్రామానికి చెందిన 15 మంది బాలబాలికలు విదేశాలలో వున్నారని సర్పంచ్ హర్‌చరణ్ సింగ్( sarpanch Harcharan Singh ) వెల్లడించారు.ఉన్నత విద్య, ఉద్యోగం కోసం ఇటీవలి సంవత్సరాల్లో యువత అమెరికాకు వెళ్తున్నారని ఆయన తెలిపారు.

సైనీ తర్వాత గ్రామంలోని కుటుంబాలు తమ పిల్లలను విదేశాలకు పంపించేందుకు వెనుకాడుతున్నాయని సర్పంచ్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube