మరికాసేపటిలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్( Finance Minister Nirmala Sitharaman ) పార్లమెంట్ కు చేరుకోనున్నారు.బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్( Interim Budget ) ను ప్రవేశపెట్టనున్నారు.
డిజిటల్ విధానంలో బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.తరువాత టాబ్ లో మధ్యంతర బడ్జెట్ ను ఆమె చదవనున్నారు.
కాగా బడ్జెట్ కు ముందు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో మధ్యంతర బడ్జెట్ ను కేంద్ర మంత్రివర్గం( Ministries of Union Cabinet Members ) ఆమోదించనుంది.అనంతరం ఉదయం 11 గంటలకు లోక్ సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.