సాధారణంగా పెద్దగా డెవలప్ కాని జిల్లాలలోనే 2 BHK ఫ్లాట్‌లు కొనాలంటే 70 లక్షల మంచి కోటి పైగా వెచ్చించాల్సి ఉంటుంది.అలాంటిది మెట్రో సిటీ ముంబైలో రెండు బెడ్‌రూమ్‌లు, హాల్, వంటగది (2 BHK) ఉన్న చిన్న ఫ్లాట్ ధర రూ.75 లక్షలకే దొరుకుతోంది.ఈ ధర ముంబైలోని ఇతర 2 BHK ఫ్లాట్‌ల కంటే చాలా తక్కువ.
ఈ ఫ్లాట్‌కు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.ఇది ముంబై శివారులోని కండివాలిలో ఎత్తైన భవనంలో ఉంది.

తక్కువ ధర, ఫ్లాట్ స్టైలిష్ డిజైన్( Stylish Design Flat ) చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.కానీ ఒక విషయాన్ని మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి.అదేంటంటే ఈ ఫ్లాట్ చాలా చిన్నది, కేవలం 323 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.బిల్డర్ ప్రతిదీ చాలా కాంపాక్ట్‌గా నిర్మించడం ద్వారా 2 BHK నిర్వహించాడు.
సోషల్ మీడియాలో రియల్ ఎస్టేట్( Real Estate ) గురించి ప్రచారం చేస్తున్న ఓ మహిళ ఈ వీడియోను రూపొందించింది.ఆమె కండివాలిలో 2 BHK ఫ్లాట్ కొనాలనుకునే వ్యక్తులకు 1 BHK ఫ్లాట్ ధరకే ఈ ఫ్లాట్‌ను పొందవచ్చని చెప్పింది.

ఈ వీడియో సోషల్ మీడియా( Social Media )లో వైరల్‌గా మారింది.దీనికి ఒక్క రోజులో 94,000 కంటే ఎక్కువ వ్యూస్, వందల కొద్దీ కామెంట్స్ వచ్చాయి.అయితే ముంబైలో ఖరీదైన, రద్దీగా ఉండే రియల్ ఎస్టేట్ మార్కెట్ చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తూ ఒక వ్యక్తి “ముంబయిలో మాత్రమే సాధ్యం” అని చెప్పాడు.అయితే “323 చదరపు అడుగులు లేదా 107 గజాలు విస్తీర్ణం అనేది పల్లెటూళ్లలో ఆవుల షెడ్ సైజు అంతే ఉంటుంది.” అని ఒక వ్యక్తి ఈ డీల్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు.







