వంగ పంట( Brinjal crop )ను ఆశించి తీవ్ర నష్టం కలిగించే పెంకు పురుగులు నారింజ రంగులో ఉంటాయి.పెంకు పురుగులు( Shell insects ) గుడ్డు ఆకారంలో ఉంటాయి.
ఆకుల కింది భాగాల్లో ఆడ పురుగులు పసుపు రంగు గుడ్లను పెడతాయి.ఎదిగిన పురుగులు మరియు లార్వాలు ఆకులను ఆహారంగా తీసుకుంటాయి.
ఆకుల ఈనెల మధ్య ఉండే ఆకుపచ్చని కణజాలాన్ని తినడం ద్వారా ఊహించని నష్టాన్ని కలిగిస్తాయి.ఇవి ఆశించిన వంగ చెట్టు ఆకులు అస్తిపంజరం లాగా తయారవుతుంది.
కేవలం ఆకులో గట్టి భాగాలు మాత్రమే మిగిలి లేత భాగాలన్నీ తినేస్తాయి.ఇంకా వంగ కాయాలకు రంద్రాలు చేస్తాయి.
మొక్కల ఎదుగుదల సక్రమంగా ఉండదు.
వంగ పంటకు తీవ్ర నష్టం కలిగించే చీడపీడలలో ఈ పెంకు పరుగులు కూడా కీలకపాత్రనే పోషిస్తాయి.పంట దిగుబడి సగానికి పైగా తగ్గే అవకాశం ఉంటుంది.ముఖ్యంగా పంట నాణ్యత కూడా కోల్పోతుంది.
వంగ తోటలో చీడపీడలకు అతిధి మొక్కలుగా వ్యవహరించే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి.తెగులు నిరోధక మేలురకం విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేపట్టాలి.పొలంలో చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.ఏవైనా చీడపీడలు ఆశిస్తే ఆకుల కింద వీటి స్థావరాలను కనిపెట్టి ఆ మొక్కలను పీకేసి నాశనం చేయాలి.మొక్కల మధ్య కాస్త అధిక దూరం ఉంటే మొక్కలు సూర్యరశ్మి గాలి బాగా తగిలి ఆరోగ్యంగా పెరగడంతో పాటు ఏవైనా చీడపీడలు ( Pests )లేదా తెగులు ఆశిస్తే వ్యాప్తి ఎక్కువగా ఉండదు.ఈ పెంకు పురుగులను వంగతోటల్లో గుర్తించిన తర్వాత రసాయన పిచికారి మందులను ఉపయోగించి తొలి దశలోనే పూర్తిగా అరికట్టాలి.
క్వినాల్ ఫాస్, మలాథియాన్, ఫెనిట్రోతిన్లతో కూడిన మందులను ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.