పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇటీవల సలార్ (Salaar) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు ప్రభాస్ వచ్చినటువంటి త్వరలోనే కల్కి(Kalki) సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇప్పటికే కలిగే సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.ఈ సినిమా మే 9వ తేదీ విడుదలవుతుందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా తర్వాత మారుతి డైరెక్షన్లో చేస్తున్నటువంటి రాజా సాబ్(Rajasaab) సినిమా కూడా షూటింగ్ దాదాపు పూర్తి కావస్తుంది.
ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ తన తదుపరి సినిమాలో అయినటువంటి స్పిరిట్ అలాగే సలార్ 2 సినిమా షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నారు.అయితే రాజా సాబ్ సినిమా తర్వాత ఈయన కొన్ని నెలల పాటు సినిమా ఇండస్ట్రీకి కాస్త విరామం ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ప్రభాస్ ఆరోగ్యం( Prabhas Health ) గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా ప్రభాస్ ఆరోగ్యం సమస్యలతో బాధపడుతున్నారని అంతే కాకుండా ఇటీవల మోకాలు సర్జరీ( Knee Surgery ) కూడా చేయించుకున్నారని మనకు తెలిసిందే.
ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయన తన ఫిట్నెస్ ( Fitness ) కూడా పూర్తిగా కోల్పోయారు.అందుకే కొన్ని నెలలపాటు సినిమా ఇండస్ట్రీకి విరామం ఇచ్చేసి ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టాలని అంతేకాకుండా తగినంత రెస్ట్ తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం అందుకోసమే కొన్ని నెలల పాటు ఇండస్ట్రీకి విరామం ఇవ్వాలని కోరుకుంటున్నారట.ఈ విరామం తర్వాతనే స్పిరిట్( Spirit ) అలాగే సలార్ సినిమా షూటింగ్ పనులను మొదలు పెట్టాలనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్టు సమాచారం.
సమంత (Samantha) కూడా ఇలాగే ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం కోసమే విరామం ప్రకటించారు ఇలా సమంత బాటలోనే ఈయన కూడా పయనిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.