టాలీవుడ్ సీనియర్ హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నాగార్జున ( Nagarjuna ) ఒకరు.అయితే ఇటీవల కాలంలో నాగార్జున నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి.
తాజాగా ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నాగార్జున నా సామి రంగ ( Naa Samiranga ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.
జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమాలో నాగార్జున అల్లరి నరేష్ రాజ్ తరుణ్ వంటి వారందరూ కూడా నటించారు.

జనవరి 14వ తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది.చాలా రోజుల తర్వాత నాగార్జున కెరియర్ లో మరో మంచి సక్సెస్ సినిమా అందుకున్నారు.ఈ సినిమా థియేటర్లో ఎంతో మంచి సక్సెస్ అందుకోగా త్వరలోనే డిజిటల్ మీడియాలో కూడా ప్రసారం కావడానికి సిద్ధమవుతుందని తెలుస్తుంది.

ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్( Disney Plus Hot Star ) భారీ ధరలకు కొనుగోలు చేశారు.థియేటర్లో ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈ సినిమా నెల రోజుల తర్వాతనే డిజిటల్ మీడియాలో కూడా ప్రసారం చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలోనే ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కాబోతుందని తెలుస్తోంది.అయితే త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అన్ని వివరాలను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అధికారికంగా వెల్లడించబోతున్నారు.
ఇక ఈ సినిమాలో నాగార్జునకి జోడిగా ఆషికా రంగనాథ్ ( Ashika Ranganath ) హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.







