టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో మాస్ మహారాజ రవితేజ(Raviteja) ఒకరు.రవితేజ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
త్వరలోనే ఈగల్ (Eagle) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఈయన సిద్ధమయ్యారు.ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకొని ఫిబ్రవరి 9వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

ఫిబ్రవరి 9వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.ఈ క్రమంలోనే రవితేజ మంచు మనోజ్(Manchu Manoj) వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి ఉస్తాద్ (Ustaad) కార్యక్రమానికి హాజరయ్యారు.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా మంచు మనోజ్ రవితేజను ఎన్నో ప్రశ్నలు వేయగా రవితేజ కూడా అంతే సరదాగా సమాధానాలు చెప్పారు.

ఈ సందర్భంగా మనోజ్ రవితేజను ప్రశ్నిస్తూ మనిద్దరం మొదటిసారి ఎక్కడ కలుసుకున్నాం అన్నయ్య అని అనడంతో రవితేజ ఆలోచనలో పడ్డారు.వెంటనే నువ్వేమైనా ఫిగరా గుర్తుపెట్టుకోవడానికి అని అనుకుంటున్నారు కదా అంటూ ఫన్నీ కామెంట్ చేశారు.ఇక రవితేజ సినిమాలలో వచ్చే బీప్ (బూతులు) ఏ హీరో సినిమాకు కూడా రావని ఇండస్ట్రీలో టాక్ అని మనోజ్ మాట్లాడటంతో రవితేజ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ.అందరూ బూతులు మాట్లాడతారు కానీ నేను ఎక్కువగా ఓపెన్ అయిపోతా అంతే తేడా అని బదులిచ్చారు.
రవితేజ చాలా సరదాగా ఉంటారని తెలుసు కానీ ఈయన బూతులు కూడా ఇంతే ఓపెన్ గా మాట్లాడుతారని తాజాగా ఈ కార్యక్రమం ద్వారా మంచు మనోజ్ ఈ విషయాలన్నింటినీ కూడా బయటపెట్టారు.ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.