వాట్సప్ లో సరికొత్తగా వీడియో కాల్స్ స్క్రీన్ షేర్ ఫీచర్.. ఎలా ఉపయోగించాలంటే..?

వాట్సప్( Whatsapp ) ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందుతోంది.వాట్సప్ వినియోగం పెరుగుతూ ఉండడంతో.

 Whatsapp Screen Sharing Option In Video Call, Video Call,whatsapp, Screen Sharin-TeluguStop.com

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.తాజాగా ఓ సరికొత్త ఫీచర్ వాట్సాప్ లో అందుబాటులోకి వచ్చింది.

ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్ కు మాత్రమే పరిమితమైన ఆ ఫీచర్ ఇప్పుడు వాట్సప్ లో కూడా ప్రవేశ పెట్టడం జరిగింది.ఇంతకీ ఆ ఫీచర్ ఏమిటంటే.

వీడియో కాల్స్ స్క్రీన్ షేర్( Video Calls Screen Share ) ఫీచర్.ఈ ఫీచర్ యువతకు చాలా ఉపయోగకరం.

కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి గ్రూప్ కాలింగ్ లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

ఈ ఫీచర్ సహాయంతో ఇతరులతో వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో మన స్మార్ట్ ఫోన్ యొక్క స్క్రీన్ ను అవతలి వ్యక్తికి మనం షేర్ చేసుకోవచ్చు.ఈ ఫీచర్ ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం.వాట్సప్ లోని డౌన్ డ్రాప్ లోకి వెళ్లి అక్కడ ఉన్న ట్యూబ్ పై ప్రెస్ చేయాలి.

అప్పుడు కెమెరా స్విచ్ ఆప్షన్ కనిపిస్తుంది.దీనిపై క్లిక్ చేస్తే స్క్రీన్ షేర్ బటన్ సింబల్ కనిపిస్తుంది.

ఆ తర్వాత ఫోన్లో స్క్రీన్ షేర్( Screen Share ) ఆప్షన్ ని స్టార్ట్ నౌ పైన క్లిక్ చేయాలి.ఇలా చేస్తే స్క్రీన్ షేర్ ఫీచర్ ఆక్టివేట్ అవుతుంది.

జూమ్ కాల్స్, గూగుల్ మీట్( Google Meet ) లాంటి వాటి వల్ల ఎదురయ్యే సమస్యలకు ఈ వీడియో కాల్ స్క్రీన్ షేరింగ్ ఫీచర్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది.ఈ ఫీచర్ తో గ్రూప్ కాల్స్ లేదా పర్సనల్ కాల్స్ వంటివి చేసుకోవచ్చు.అంతేకాదు ఈ ఫీచర్ తో మొబైల్ లోని డేటాను సైతం షేర్ చేసుకోవచ్చు.యువతను అట్రాక్ట్ చేయడం కోసం వాట్సాప్ సంస్థ ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube