నేటితరం యువతలో చాలామంది సులువైన ఉద్యోగాలపై దృష్టి పెడుతున్నారు.తక్కువ సమయంలో ఎక్కువ వేతనం వచ్చే ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తూ సత్తా చాటుతున్నారు.
అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన మౌనిక( Porika Mounika ) మాత్రం తండ్రి కలే తన కల అని భావించడంతో పాటు జర్మనీలో పీహెచ్డీ పూర్తి చేసి భారత్ కు తిరిగి వచ్చారు.తండ్రి తన కూతురు సివిల్స్ సాధించాలని కోరడంతో ఆమె సివిల్స్ పై దృష్టి పెట్టారు.
నాలుగుసార్లు ఆశించిన ఫలితం రాకపోయినా ఐదో ప్రయత్నంలో సత్తా చాటిన పోరిక మౌనిక సక్సెస్ స్టోరీ ( Porika Mounika Success Story )ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

హైదరాబాద్ లో చదువుకున్న మౌనిక 2009 సంవత్సరంలో పదో తరగతి, 2011 సంవత్సరంలో ఇంటర్ బైపీసీ పూర్తి చేశారు.హైదరాబాద్ లో బీఫార్మసీ పూర్తి చేసిన మౌనిక ఆ తర్వాత బెంగళూరులో సివిల్స్ ఎంపికకు శిక్షణ తీసుకోవడం జరిగింది.కష్టపడితే సక్సెస్ కచ్చితంగా దక్కుతుందని ఆమె చెబుతున్నారు.
లక్ష్య సాధన విషయంలో వెనుకడుగు వేయవద్దని పోరిక మౌనిక చెబుతున్నారు.నాన్న సివిల్స్ సాధించాలని భావించినా సాధించలేదని నేను ఐదు ప్రయత్నాలు చేశానని ఆమె పేర్కొన్నారు.
నాకు పోలీస్ సూట్ అవుతుందని ఐపీఎస్( IPS ) ఎంపిక చేసుకున్నానని మౌనిక చెప్పుకొచ్చారు.నాన్న ఏజీఎం అని అమ్మ వాణీకుమారి భద్రాచలంలో పెట్రోల్ బంక్ బిజినెస్ చేస్తున్నారని ఆమె కామెంట్లు చేశారు.

సక్సెస్ దక్కే వరకు వెనుకడుగు వేయవద్దని ఆమె కామెంట్లు చేశారు.సమస్యల గురించి తెలుసుకుని ముందడుగులు వేయడానికి సమయం పడుతుందని మౌనిక అభిప్రాయపడ్డారు.నాకు మా కుటుంబం నుంచి ముఖ్యంగా నాన్న నుంచి సపోర్ట్ లభించిందని ఆమె పేర్కొన్నారు.ఇతరులతో పోల్చకుండా ఆసక్తి ఉన్న రంగంలో ప్రోత్సహిస్తే సక్సెస్ దక్కుతుందని మౌనిక కామెంట్లు చేశారు.
మౌనిక టాలెంట్ గురించి తెలిసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.







