ఈ మధ్య కాలంలో ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న బర్రెలక్క శిరీష( Barrelakka Sirisha ) ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు.అయితే తెలంగాణలో జరగనున్న లోక్ సభ ఎంపీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయనున్నారని తెలుస్తోంది.
తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన శిరీష ఆ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించడం గమనార్హం.ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయినా ఫీల్ కాలేదని ఆమె తెలిపారు.
పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత నేను కాల్ చేయలేదని శిరీష పేర్కొన్నారు.

పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) తో పెళ్లి అంటూ వైరల్ అయిన వార్తల గురించి ఆమె స్పందిస్తూ ఈ వార్తలు నేను వినలేదని ఆమె అన్నారు.వ్యూస్ కోసం ఈ విధంగా చేస్తున్నారని శిరీష అభిప్రాయపడ్డారు.అలాంటి యూట్యూబ్ ఛానెల్స్ ఇంప్రెషన్ ను పోగొట్టుకుంటాయని ఆమె తెలిపారు.
నేను ప్రశాంత్ ను అన్న అని పిలుస్తానని అన్నల్ని మ్యారేజ్ చేసుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు.నేను ఏ యూట్యూబ్ ఛానల్ పై స్ట్రైక్ కానీ, కాపీ రైట్ కూడా వేయలేదని శిరీష వెల్లడించారు.
పొలిటికల్( Political Journey ) గా ప్రయాణం అయితే ఆపనని శిరీష తెలిపారు.మనం మంచి పని చేస్తే మీడియా నుంచి కచ్చితంగా సపోర్ట్ వస్తుందని ఆమె పేర్కొన్నారు.
నేను హైదరాబాద్ లో బీఈడీ చదువుకుంటున్నానని నేను ఏం చేయాలో నాకు ప్లానింగ్ ఉందని శిరీష కామెంట్లు చేశారు.

ప్రజలు సర్పంచ్( Sarpanch ) లను గట్టిగా అడగడానికి భయపడతారని ఆమె అన్నారు.నా దగ్గర ఉన్న డబ్బుతో నా వల్ల చేతనైనంత సహాయం చేస్తున్నానని ఆమె తెలిపారు.కామెంట్లు చేసేంత ఆసక్తి బయట ఘటన జరిగినప్పుడు ఎందుకు ఉండదని శిరీష వెల్లడించారు.
ప్రొటెక్షన్ కావాలని సాధ్యమైనంత వరకు అడగనని ఆమె తెలిపారు.నేను నా పోరాటం అయితే ఆపనని శిరీష పేర్కొన్నారు.







