ఏపీ అంగన్ వాడీ కేంద్రంలో కూతురిని చేర్చిన ఐఏఎస్ ఆఫీసర్.. ఎంతోమందికి స్పూర్తి అంటూ?

సాధారణంగా అంగన్ వాడీ కేంద్రాలలో( Anganwadi Centers ) పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన పిల్లలు ఎక్కువగా చదువుకుంటారనే సంగతి తెలిసిందే.ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లలో ఎవరూ తమ పిల్లలను అంగన్ వాడీ కేంద్రానికి పంపడానికి ఇష్టపడరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Ias Officer Suraj Ganore Daughter In Anganwadi Center Details, Ias Officer Suraj-TeluguStop.com

అయితే ఏపీలో పని చేస్తున్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాత్రం తన కూతురిని అంగన్ వాడీ కేంద్రంలో చేర్పించి వార్తల్లో నిలిచారు.

సూరజ్ గనోరే( IAS Suraj Ganore ) అనే వ్యక్తి మూడు సంవత్సరాల వయస్సు ఉన్న తన కూతురు సృష్టి గనోరేను( Shrusti Ganore ) అంగన్ వాడీ కేంద్రంలో చేర్చారు.

సూరజ్ గనోరే ప్రస్తుతం రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా పని చేస్తున్నారు.మూడున్నర సంవత్సరాల వయస్సు ఉన్న తన కూతురును సూరజ్ గనోరే అంగన్ వాడీ కేంద్రంలో చేర్చడంపై ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Telugu Anganwadi, Iasanganwadi, Rampachodavaram, Shrusti Ganore, Suraj Ganore-In

సూరజ్ గనోరే ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారని నెటిజన్లు చెబుతున్నారు.సూరజ్ గనోరే చేసిన పని వల్ల అంగన్ వాడీలపై నమ్మకం మరింత పెరిగిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.సీడీపోవో సంధ్యారాణి చిన్నారికి పాఠాలు బోధిస్తుండగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.సూరజ్ గనోరే తీసుకున్న నిర్ణయం వల్ల రాబోయే రోజుల్లో మరి కొందరు ఐఏఎస్ లు( IAS ) ఈ దిశగా అడుగులు వేసే ఛాన్స్ అయితే ఉంది.

Telugu Anganwadi, Iasanganwadi, Rampachodavaram, Shrusti Ganore, Suraj Ganore-In

సూరజ్ గనోరే విధులను పర్ఫెక్ట్ గా నిర్వహిస్తూ ప్రజల దృష్టిలో మంచి పేరును సంపాదించుకుంటున్నారు.ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ విధులకు సూరజ్ గనోరే నూటికి నూరు శాతం న్యాయం చేస్తున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.సృష్టి గనోరే ప్రస్తుతం స్థానిక ఎర్రంరెడ్డినగరంలో ఉన్న అంగన్వాడీ పాఠశాలలో( Anganwadi School ) చదువుకుంటున్నారు.సూరజ్ గనోరే తన కూతురి విషయంలో తీసుకున్న నిర్ణయానికి నెటిజన్లు హ్యాట్సాఫ్ అని చెబుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube