చిరంజీవి త్రివిక్రమ్ ఫోటోపై పూనమ్ కౌర్ షాకింగ్ కామెంట్స్.. అలాంటి సింబల్ ను షేర్ చేస్తూ?

చిరంజీవి త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమాలేవీ తెరకెక్కకపోయినా చిరంజీవి( Chiranjeevi ) నటించిన జై చిరంజీవ సినిమా కోసం వీళ్లిద్దరూ కలిసి పని చేశారు.చిరంజీవికి పద్మవిభూషణ్( Padma Vibhushan ) రావడంతో తాజాగా త్రివిక్రమ్ చిరంజీని కలిశారు.

 Poonam Kaur Shocking Comments About Chiranjeevi Trivikram Photo Details, Poonam-TeluguStop.com

ఈ ఫోటోలలో త్రివిక్రమ్ గడ్డం లేకుండా కనిపించగా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.అయితే త్రివిక్రమ్ అంటే పూనమ్ కౌర్ చాలా సందర్భాల్లో కోపాన్ని ప్రదర్శిస్తారు.

చిరంజీవి త్రివిక్రమ్ ఫోటో గురించి పూనమ్ కౌర్( Poonam Kaur ) రియాక్ట్ అవుతూ చిరంజీవి త్రివిక్రమ్ ఫోటోను చూస్తే ఎంతో బాధగా ఉందని బ్రోకెన్ హార్ట్ సింబల్ ను ఆమె షేర్ చేశారు.అయితే త్రివిక్రమ్( Trivikram ) మాత్రం పూనమ్ కౌర్ గురించి నెగిటివ్ గా ఎక్కడా కామెంట్ చేయలేదనే సంగతి తెలిసిందే.

త్రివిక్రమ్ కెరీర్ విషయానికి వస్తే తర్వాత ప్రాజెక్ట్ విషయంలో ఏ మాత్రం స్పష్టత లేదు.

త్రివిక్రమ్ అద్భుతమైన కథ చెబితే నటించడానికి టాలీవుడ్ స్టార్స్ సిద్ధంగా ఉన్నారు.పవన్, చిరంజీవి, బన్నీ, రామ్, నాని, వెంకటేశ్ మరి కొందరు హీరోల పేర్లు త్రివిక్రమ్ తర్వాత సినిమా విషయంలో వినిపిస్తోంది.అయితే ఈ హీరోలలో ఎవరు పేరు ఫైనల్ అవుతుందో చూడాల్సి ఉంది.

త్రివిక్రమ్ రెమ్యునరేషన్( Trivikram Remuneration ) సైతం భారీ రేంజ్ లో ఉండగా హారిక హాసిని బ్యానర్ లో మాత్రమే త్రివిక్రమ్ సినిమాలు తెరకెక్కుతున్నాయి.

గుంటూరు కారం( Guntur Karam Movie ) సినిమా వల్ల భారీగా లాభాలు వచ్చాయని నిర్మాతలు చెబుతున్నా కొన్ని ఏరియాలలో ఈ సినిమాకు నష్టాలు తప్పలేదని తెలుస్తోంది.మహేష్ బాబు( Mahesh Babu ) తర్వాత సినిమా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.గుంటూరు కారం ఫుల్ రన్ దాదాపుగా ముగిసినట్లేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

త్రివిక్రమ్ తర్వాత సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube