చిరంజీవి త్రివిక్రమ్ ఫోటోపై పూనమ్ కౌర్ షాకింగ్ కామెంట్స్.. అలాంటి సింబల్ ను షేర్ చేస్తూ?
TeluguStop.com
చిరంజీవి త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమాలేవీ తెరకెక్కకపోయినా చిరంజీవి( Chiranjeevi ) నటించిన జై చిరంజీవ సినిమా కోసం వీళ్లిద్దరూ కలిసి పని చేశారు.
చిరంజీవికి పద్మవిభూషణ్( Padma Vibhushan ) రావడంతో తాజాగా త్రివిక్రమ్ చిరంజీని కలిశారు.
ఈ ఫోటోలలో త్రివిక్రమ్ గడ్డం లేకుండా కనిపించగా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే త్రివిక్రమ్ అంటే పూనమ్ కౌర్ చాలా సందర్భాల్లో కోపాన్ని ప్రదర్శిస్తారు.చిరంజీవి త్రివిక్రమ్ ఫోటో గురించి పూనమ్ కౌర్( Poonam Kaur ) రియాక్ట్ అవుతూ చిరంజీవి త్రివిక్రమ్ ఫోటోను చూస్తే ఎంతో బాధగా ఉందని బ్రోకెన్ హార్ట్ సింబల్ ను ఆమె షేర్ చేశారు.
అయితే త్రివిక్రమ్( Trivikram ) మాత్రం పూనమ్ కౌర్ గురించి నెగిటివ్ గా ఎక్కడా కామెంట్ చేయలేదనే సంగతి తెలిసిందే.
త్రివిక్రమ్ కెరీర్ విషయానికి వస్తే తర్వాత ప్రాజెక్ట్ విషయంలో ఏ మాత్రం స్పష్టత లేదు.
"""/" /
త్రివిక్రమ్ అద్భుతమైన కథ చెబితే నటించడానికి టాలీవుడ్ స్టార్స్ సిద్ధంగా ఉన్నారు.
పవన్, చిరంజీవి, బన్నీ, రామ్, నాని, వెంకటేశ్ మరి కొందరు హీరోల పేర్లు త్రివిక్రమ్ తర్వాత సినిమా విషయంలో వినిపిస్తోంది.
అయితే ఈ హీరోలలో ఎవరు పేరు ఫైనల్ అవుతుందో చూడాల్సి ఉంది.త్రివిక్రమ్ రెమ్యునరేషన్( Trivikram Remuneration ) సైతం భారీ రేంజ్ లో ఉండగా హారిక హాసిని బ్యానర్ లో మాత్రమే త్రివిక్రమ్ సినిమాలు తెరకెక్కుతున్నాయి.
"""/" /
గుంటూరు కారం( Guntur Karam Movie ) సినిమా వల్ల భారీగా లాభాలు వచ్చాయని నిర్మాతలు చెబుతున్నా కొన్ని ఏరియాలలో ఈ సినిమాకు నష్టాలు తప్పలేదని తెలుస్తోంది.
మహేష్ బాబు( Mahesh Babu ) తర్వాత సినిమా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.
గుంటూరు కారం ఫుల్ రన్ దాదాపుగా ముగిసినట్లేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
త్రివిక్రమ్ తర్వాత సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది.
మహా కుంభమేళా 2025 : ఎన్ఆర్ఐల కోసం యోగి సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు