డైరెక్టర్ తేజ… భిన్నమైన చిత్రాలతో తన కెరియర్ ప్రారంభించి, నేటికీ విభిన్నమైన సినిమాలను తీస్తూ తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు.ప్రస్తుతం రానా తో రాక్షస రాజా( rakshasa raja ) అనే సినిమాని తీస్తున్న తేజ.చిత్రం సినిమాతో తన కెరీర్ నీ ప్రారంభించాడు.2000 సంవత్సరంలో రామోజీ ఫిలిం సిటీ లో కేవలం 40 లక్షల రూపాయలతో ఈ చిత్రాన్ని తీసి అమోఘమైన విజయాన్ని అందుకున్నాడు.ఆ తర్వాత ఎన్నో ఎత్తుపలాలతో కూడిన తేజ కెరియర్ అందరికీ తెలిసిందే.తేజ మాటలు ఎంతో ఫిలాసఫీతో కూడుకొని ఉంటాయి. వర్మ శిష్యరికంలో మొదలు పెట్టిన ఆయన కెరియర్ అలాగే వ్యక్తిగత జీవితం కూడా వర్మ లాగానే కనిపిస్తూ ఉంటుంది.
1966లో మద్రాసులో తేజ J.B.K చౌదరి( J.B.K Chaudhary ) అనే ఒక వ్యాపారవేత్త కుటుంబంలో జన్మించాడు.టోక్యో మరియు జపాన్( Tokyo, Japan ) లో ఎక్కువగా వీరి బిజినెస్ సాగేది.ఆంధ్రప్రదేశ్, మద్రాస్ నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ చేసేవారు.నిజానికి మంచి స్థితిమంతుల ఇంటిలో తేజ జన్మించాడు.కానీ తన తండ్రి వ్యాపారంలో నష్టపోయి రోడ్డు మీదికి వచ్చిన సందర్భంగా తేజ చిన్న వయసులోనే పని చేయడం ప్రారంభించాడు.
చౌదరి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఏ రోజు తన ఇంటి పేరు చౌదరి అని చెప్పుకోవడానికి ఇష్టపడడు తేజ.తనను తాను ఎప్పుడూ యాంటీ కాస్ట్,యాంటీ రీజియన్, యాంటీ రిలీజియన్ గా ఉంచుకోవడానికి ఇష్టపడతాడు.
కులం మతం అనే విషయాల్లో అతనికి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు అంతేకాదు ప్రాంతం బేధాలు కూడా ఉండవు అందుకే తన పేరులో ఉన్న చౌదరిని ఎప్పుడో కట్ చేసుకున్నాడు.ఇక తేజాకి డిస్ట్రిబ్యూషన్ లో కూడా అనుభవం ఉంది.హైదరాబాద్ మరియు వైజాగ్ లలో ఆఫీసులో కూడా ఉన్నాయి.పలు ఇంగ్లీష్ సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు.డైరెక్షన్ చేయడానికి ముందు సినిమాటోగ్రాఫర్ గా కూడా పని చేశాడు.అతడికి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కూడా చాలా ఇష్టం.