Rahat Fateh Ali Khan : శిష్యుణ్ని చెప్పుతో కొట్టిన ప్రముఖ సింగర్.. నెట్టింట్లో వీడియో వైరల్!

తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియోలో ఒక ప్రముఖ సింగర్ తన శిష్యుని చెప్పుతో కొట్టారు.

 Rahat Fateh Ali Khan Thrashes Student With Shoe-TeluguStop.com

ఇంతకీ ఆ వీడియోలో ఉన్నది ఎవరు? ఎందుకు కొట్టారు అన్న వివరాల్లోకి వెళితే. పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ గాయకుడు రాహత్‌ ఫతేహ్‌ అలీ ఖాన్( Rahat fateh ali khan ) తన శిష్యుణ్ని చెప్పుతో కొడుతున్న వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది.

అయితే ఆ వీడియోలో ఉన్నది తానే అని ఫతేహ్‌ అలీ ఖాన్ ధ్రువీకరించారు.అంతే కాకుండా బాధితుడికి క్షమాపణలు తెలిపారు.ఒక బాటిల్ కనిపించకుండా పోయిన విషయంలో అతడిపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది.తనని వదిలేయాలంటూ బాధితుడు ప్రాధేయపడుతుండటం ఆ వీడియోలో గమనించవచ్చు.

కానీ సహనం కోల్పోయిన అలీ ఖాన్‌ను ఇతర సిబ్బంది నిలువరించారు.దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌ కావడంతో వివరణ ఇస్తూ అలీ ఖాన్‌ మరో వీడియో విడుదల చేశారు.ఇది గురు, శిష్యుల మధ్య విషయమని వ్యాఖ్యానించారు.బాధితుడు తన సొంత శిష్యుడేనని కుమారుడిలాంటి వాడని చెప్పుకొచ్చారు.శిష్యుడు తప్పు చేస్తే గురువు దండించినట్లుగానే దీన్ని భావించాలని అన్నారు
.

ఒకవేళ అతడు మంచి చేస్తే ప్రేమ కురిపిస్తానని తప్పు చేస్తే శిక్షిస్తానని అన్నారు.బాధితుడికి తర్వాత క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారు.అయితే ఈ ఘటనపై వివరణ ఇచ్చిన వీడియోలో బాధితుడు కూడా మాట్లాడారు.

పవిత్ర జలానికి( Holy water ) సంబంధించిన ఒక బాటిల్ కనిపించకుండా పోవడానికి తానే కారణమని, అందుకే ఫతేహ్‌ అలీ ఖాన్‌ దండించారని తెలిపారు.అంతకుమించి దీంట్లో ఎలాంటి దురుద్దేశం లేదని అన్నారు సదరు బాధితుడు.అలీ ఖాన్‌ తనకు తండ్రిలాంటి వారని.తమని చాలా ప్రేమిస్తారని చెప్పారు.తమ గురువు పరువుకు భంగం కలిగించాలనే ఉద్దేశంతోనే ఎవరో ఈ వీడియోను వైరల్‌ చేశారని చెప్పాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube