హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) గురించి మనందరికీ తెలిసిందే.అందాల రాక్షసి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇది ఇలా ఉంటే ఈమె గత ఏడాది మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్( Mega Princess Varun Tej ) ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం మళ్లీ ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ బిజీగా మారే ప్రయత్నంలో ఉంది లావణ్య త్రిపాఠి.
అందులో భాగంగానే ఈమె త్వరలోనే మిస్ పర్ఫెక్ట్ ( Miss Perfect )అనే సినిమా వెబ్ సిరీస్ లో నటిస్తోంది ఇందులో క్లీనింగ్ పట్ల ఎంతో నిబద్ధత కలిగిన అమ్మాయి పాత్రలో లావణ్య నటిస్తోంది.
బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ ( Abhijith )హీరోగా నటిస్తున్నాడు.ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 2న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ హాట్ స్టార్‌లో ( Disney’s Hot Star )స్ట్రీమింగ్ కానుంది.దీంతో ప్రమోషన్స్ షురూ చేశారు.
అయితే టీజర్స్, ట్రైలర్స్‌తో ఆసక్తిని క్రియేట్ చేసిన మిస్ పరఫెక్ట్ టీమ్ తమ ప్రమోషన్స్‌ను కూడా వెరైటీగా ప్లాన్ చేశారు.నేషనల్ క్లీన్లినెస్ డే జాతీయ పరిశుభ్రతా దినోత్సవం వేడుకల్లో భాగంగా ఆదివారం జనవరి 28 న విశాఖపట్నంలో బీచ్ క్లీనింగ్ డ్రైవ్ చేపట్టనున్నారు.
ఈ కార్యక్రమంలో లావణ్య త్రిపాఠి కూడా పాల్గొననుంది.ఉదయం 6 గంటలకు వైఎంసీఏ బీచ్ వద్ద స్థానికులతో కలసి పరిసరాలను క్లీన్ చేయనున్నారు.
లావణ్యతో పాటు హీరో అభిజిత్ కూడా ఈ క్లీనింగ్ డ్రైవ్‌లో పాల్గొననున్నాడు.ఈ ప్రోగ్రామ్‌లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మిస్ పర్‌ఫెక్ట్ టీమ్‌తో పాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్ కోరింది.మిస్ పర్‌ఫెక్ట్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా లావణ్య.ఈ మధ్యే ప్రొ కబడ్డీ లీగ్ పోటీలకు కూడా హాజరైంది.హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లకు వెళ్లిన ఈ అందాల తార అక్కడ తెలుగు టైటాన్స్ ను ఎంకరేజ్ చేసింది.మొత్తానికి తన మిస్ పర్‌ఫెక్ట్ సిరీస్‌ను బాగానే జనాల్లోకి తీసుకెళుతోంది మెగా కోడలు.
మిస్ పర్‌ఫెక్ట్ వెబ్ సిరీస్‍కు స్కైలాబ్ మూవీ ఫేమ్ విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.