ఈ మధ్యకాలంలో యువతకు ప్రతీ విషయం జోక్‌గా మారింది.ఎక్కడ ఏ మాట మాట్లాడాలో, ఏం చెప్పాలో కూడా తెలియకుండా ప్రవర్తిస్తూ చిక్కుల్లో పడుతున్నారు.
తాజాగా యూకేలో( UK ) భారత సంతతికి చెందిన ఓ విద్యార్ధి సోషల్ మీడియాలో జోక్ చేసినట్లుగా పెట్టిన ఓ పోస్ట్ అతని మెడకు చుట్టుకుంది.వివరాల్లోకి వెళితే.
బాత్ యూనివర్సిటీలో( Bath University ) ఎకనామిక్స్ చదువుతున్న ఆదిత్య వర్మ( Aditya Verma ) అనే బ్రిటీష్ ఇండియన్ విద్యార్ధి తన స్నేహితులకు స్నాప్‌చాట్ ద్వారా ఓ మెసేజ్ పెట్టాడు.ఇందులో పెద్ద నేరం ఏముందనేగా మీ డౌట్.
సాధారణ పోస్ట్ అయితే ఎవరూ పట్టించుకునేవారు కాదు.కానీ అందులో అతను కరడుగట్టిన ఉగ్రవాద ముఠా, ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌ను ఏలుతున్న తాలిబన్ల గురించి ప్రస్తావించారు.
2022 జూలైలో వర్మ తన స్నేహితులతో కలిసి మెనోర్కా ద్వీపానికి వెళ్లాడు.ఈ సందర్భంగా తాను తాలిబన్ సభ్యుడినని, ( Taliban Member ) విమానాన్ని పేల్చివేస్తానని స్నాప్‌చాట్‌లో ఓ సరదా పోస్ట్ పెట్టాడు.
గాట్విక్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరే ముందు ‘‘ ఇప్పుడు నేను విమానాన్ని( Flight ) పేల్చివేయానికి వెళ్తున్నాను (నేను తాలిబన్ సభ్యుడిని) అంటూ పోస్ట్ పెట్టాడు ’’.అయితే ఎయిర్‌పోర్టులోని వైఫై నెట్‌వర్క్ ఈ సందేశాన్ని అత్యంత ప్రమాదకరమైన చర్యగా గుర్తించి అధికారులను అప్రమత్తం చేసింది.
దీంతో వారు స్పానిష్ ఏజెన్సీలకు సమాచారం అందించారు.ఈ అలర్ట్‌తో వెంటనే రంగంలోకి దిగిన స్పానిష్ ఎయిర్‌ఫోర్స్ . రెండు ఎఫ్ 18 జెట్లను పంపింది.విమానం మెనోర్కాలో ల్యాండ్ అయ్యే వరకు సహాయంగా పంపించింది.
ఆ వెంటనే ఆదిత్య వర్మను అదుపులోకి తీసుకున్నారు .రెండు రోజుల పోలీస్ కస్టడీ( Police Custody ) ముగిసిన తర్వాత అతనిని బెయిల్‌పై విడుదల చేశారు.చావుతప్పి కన్నులొట్టపడినట్లుగా ఎలాగోలా యూకేకు చేరుకోగా.స్వదేశంలోనూ బ్రిటీష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా ఆదిత్య వర్మను ప్రశ్నించాయి.
తాను సరదా కోసమే ఆ మెసేజ్‌ను ఫ్రెండ్స్‌కు పంపించానని ఆ విద్యార్ధి పోలీసులకు , న్యాయస్థానానికి తెలిపాడు.ఈ కేసుపై కోర్ట్ త్వరలో తీర్పు వెలువరించనుంది.ఈ నేరం రుజువైతే ఆదిత్య వర్మకు 22,500 యూరోలు (భారత కరెన్సీలో రూ.20 లక్షలు) వరకు జరిమానా విధించే అవకాశం వుంది.దీనికి తోడు ఖర్చుల కోసం స్పెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ 95,000 యూరోలు (రూ.80 లక్షలకు పైనే) డిమాండ్ చేస్తోంది.