యూపీఎస్సీ ( UPSC )పరీక్షలో సక్సెస్ సాధించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.మూడుసార్లు ప్రయత్నం చేసి ఆశించిన ఫలితం రాకపోయినా నాలుగో ప్రయత్నంలో ఎంతో కష్టపడి కిస్లాయ్ కుశ్వాహా( Kislai Kushwaha ) యూపీఎస్సీ లక్ష్యాన్ని సాధించడం గమనార్హం.
ఇతని సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. యూపీలోని ఘాజీపూర్ కు చెందిన కిస్లాయ్ కుశ్వాహా చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేవారు.
కిస్లాయ్ కు రెండేళ్ల వయస్సు ఉన్న సమయంలో తండ్రి వదిలేశాడు.ఆ సమయంలో తల్లి కష్టపడి కిస్లాయ్ ను పెంచింది.2020 సంవత్సరంలో జరిగిన యూపీఎస్సీ పరీక్షలో కిస్లాయ్ 526వ ర్యాంక్ సాధించారు.2021 సంవత్సరంలో ఏకంగా 136వ ర్యాంక్ ను సాధించి ఐఏఎస్ అయ్యారు.ఇంటర్ తర్వాత ఢిల్లీ ఐఐటీకి( IIT Delhi ) ఎంపికైన కిస్లాయ్ కొంతకాలం పాటు ఎన్టీపీసీలో పని చేశారు.

మానసిక పరిపక్వత ఉంటే లక్ష్యాన్ని సాధించడం సులువేనని కిస్లాయ్ కుశ్వాహా చెప్పుకొచ్చారు.కుటుంబ సభ్యుల సహకారంతో ప్రతికూలతలను అధిగమించి కెరీర్ పరంగా ముందడుగులు వేశానని కిస్లాయ్ కుశ్వాహా అన్నారు.యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూ 35 నిమిషాల పాటు జరిగిందని చెప్పుకొచ్చారు.
కిస్లాయ్ కుశ్వాహా సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.భవిష్యత్తులో కిస్లాయ్ కు మరిన్ని విజయాలు దక్కాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కిస్లాయ్ కుశ్వాహా తన సక్సెస్ తో ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.బాల్యం నుంచి పిల్లల్ని బాగా చదివిస్తూ లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేస్తే కచ్చితంగా సక్సెస్ సొంతమవుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతునాయి.కిస్లాయ్ కుశ్వాహా కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.తండ్రి సపోర్ట్ లేకుండా పిల్లల్ని పెంచాలంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అయితే కిస్లాయ్ తల్లి మాత్రం చదువుతోనే పిల్లల భవిష్యత్తు మారుతుందని భావించి కొడుకు కెరీర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.







