జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికల సమయం దగ్గరకు వచ్చే కొద్దీ దూకుడు పెంచుతున్నారు.టిడిపి ( TDP )రెండు సీట్లను ప్రకటించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
దీంతో తాము కూడా రెండు సీట్లను ప్రకటిస్తున్నామంటూ రాజోలు, రాజానగరం సీట్లలో జనసేన పోటీ చేస్తుందని పవన్ వ్యాఖ్యానించారు .ఈ సందర్భంగా టిడిపి పైన పరోక్షంగా విమర్శలు చేశారు .తమకు చెప్పకుండానే సీట్లు కేటాయించడం , సీఎం సీటు విషయంలో కొంతమంది టిడిపి నేతలు చేసిన వ్యాఖ్యలు వంటి అన్నిటిని పవన్ ప్రస్తావిస్తూ ఇది పొత్తు ధర్మానికి విరుద్ధం అంటూ పవన్ వ్యాఖ్యానించారు .ఆ తరువాత పార్టీ నాయకులతో పవన్ రహస్యంగా సమావేశం నిర్వహించారు .ఈ నెలాఖరులోగా పార్టీ అభ్యర్థులను ఖరారు చేయబోతున్నామనే విషయాన్ని ఈ సమావేశంలో చెప్పారట ఈ పరిణామాలు తర్వాత పవన్ ఢిల్లీకి వెళ్లారు .
ఈరోజు లేదా రేపు కేంద్ర బిజెపి( BJP ) పెద్దలతో పవన్ ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు .ముఖ్యంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda )అపాయింట్మెంట్ దొరికితే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా( Home Minister Amit Shah ) తోను బేటి కావాలని పవన్ నిర్ణయించుకున్నారట .ఈ సందర్భంగా ఏపీలో పొత్తుల విషయంలో బిజెపి ఏ నిర్ణయం తీసుకుందనే విషయాన్ని పవన్ బిజెపి పెద్దల వద్ద తేల్చుకుంటారని, టిడిపి , జనసేనతో బిజెపి కలిసి వచ్చే విధంగా పవన్ బిజెపి నీ ఒప్పిస్తారు అని, ఒకవేళ ఆ ప్రతిపాదన కు ఒప్పుకోకపోతే టీడీపీని కలుపుకుని వెళ్లే లా కీలక నిర్ణయం తీసుకోవాలని పవన్ నిర్ణయించుకున్నారట.
ఈ విషయాలను తేల్చుకునేందుకే ఆయన ఢిల్లీకి వెళ్లినట్లుగా జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.ప్రస్తుతం టిడిపి ,జనసేన( TDP, Janasena ) లు సీట్ల విషయంలో తీవ్రంగా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో, బీజేపీ తమతో కలిసి వస్తే ఆ పార్టీకి సీట్లు కేటాయించవచ్చని , ఒకవేళ బిజెపి తమతో కలిసి వచ్చేందుకు ఆసక్తి చూపించకపోతే, టిడిపి, జనసేనలు సీట్లు సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్లేలా పవన్ సిద్ధంగానే ఉన్నారట.