ఢిల్లీకి పవన్ .. ఇక ఆ విషయం తేల్చేస్తారా  ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికల సమయం దగ్గరకు వచ్చే కొద్దీ దూకుడు పెంచుతున్నారు.

టిడిపి ( TDP )రెండు సీట్లను ప్రకటించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

దీంతో తాము కూడా రెండు సీట్లను ప్రకటిస్తున్నామంటూ రాజోలు,  రాజానగరం సీట్లలో జనసేన పోటీ చేస్తుందని పవన్ వ్యాఖ్యానించారు .

ఈ సందర్భంగా టిడిపి పైన పరోక్షంగా విమర్శలు చేశారు .తమకు చెప్పకుండానే సీట్లు కేటాయించడం , సీఎం సీటు విషయంలో కొంతమంది టిడిపి నేతలు చేసిన వ్యాఖ్యలు వంటి అన్నిటిని పవన్ ప్రస్తావిస్తూ ఇది పొత్తు ధర్మానికి విరుద్ధం అంటూ పవన్ వ్యాఖ్యానించారు .

ఆ తరువాత పార్టీ నాయకులతో పవన్ రహస్యంగా సమావేశం నిర్వహించారు .ఈ నెలాఖరులోగా పార్టీ అభ్యర్థులను ఖరారు చేయబోతున్నామనే విషయాన్ని ఈ సమావేశంలో చెప్పారట ఈ పరిణామాలు తర్వాత పవన్ ఢిల్లీకి వెళ్లారు .

"""/" / ఈరోజు లేదా రేపు కేంద్ర బిజెపి( BJP ) పెద్దలతో పవన్ ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు .

ముఖ్యంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda )అపాయింట్మెంట్ దొరికితే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా( Home Minister Amit Shah ) తోను బేటి కావాలని పవన్ నిర్ణయించుకున్నారట .

ఈ సందర్భంగా ఏపీలో పొత్తుల విషయంలో బిజెపి ఏ నిర్ణయం తీసుకుందనే విషయాన్ని పవన్ బిజెపి పెద్దల వద్ద తేల్చుకుంటారని,  టిడిపి , జనసేనతో బిజెపి కలిసి వచ్చే విధంగా పవన్ బిజెపి నీ ఒప్పిస్తారు అని,  ఒకవేళ ఆ ప్రతిపాదన కు ఒప్పుకోకపోతే టీడీపీని కలుపుకుని వెళ్లే లా కీలక నిర్ణయం తీసుకోవాలని పవన్ నిర్ణయించుకున్నారట.

"""/" /  ఈ విషయాలను తేల్చుకునేందుకే ఆయన ఢిల్లీకి వెళ్లినట్లుగా జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రస్తుతం టిడిపి ,జనసేన( TDP, Janasena ) లు సీట్ల విషయంలో తీవ్రంగా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో,  బీజేపీ తమతో కలిసి వస్తే ఆ పార్టీకి సీట్లు కేటాయించవచ్చని , ఒకవేళ బిజెపి తమతో కలిసి వచ్చేందుకు ఆసక్తి చూపించకపోతే,  టిడిపి, జనసేనలు సీట్లు సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్లేలా పవన్ సిద్ధంగానే ఉన్నారట.

తల్లీ కూతురుతో రొమాన్స్ చేసిన సీనియర్ ఎన్టీఆర్.. ఈ రికార్డ్ ఈ స్టార్ హీరోకే సొంతం!