జపనీయుల బీర్ మెషిన్ చూశారా.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో...

సాధారణంగా మందుబాబులకు బార్టెండర్లు లేదంటే వేరే బారి సిబ్బంది మందు చక్కగా కలిపి సర్వ్ చేస్తారు.కానీ జపాన్‌లోని ఒక కొత్త మెషిన్ స్వయంగా బీరును పోయగలదు.

 Self-pouring Beer Machine At All-you-can-drink Restaurant In Japan,viral Video,s-TeluguStop.com

బీరు మిక్సింగ్, సర్వింగ్‌ను సులభతరం చేయడానికి, వేగవంతం చేయడానికి ఓ స్మార్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ( Smart Innovative Technology )ని జపాన్ బీర్ షాప్ ఒకటి ఉపయోగిస్తోంది.కొంతమంది ఈ టెక్నాలజీని ఇష్టపడ్డారు మరి కొంతమంది మాత్రం దీనిని ఇష్టపడలేదు.

మెషిన్ పనితీరుకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఒక వ్యక్తి బీరు గ్లాసు ముందు ఉంచగా ఆ యంత్రం ఎలా పనిచేస్తుందో కనిపించింది.

ముందుగా ఫ్రిజ్ లోంచి కోల్డ్ గ్లాస్ తీసుకుని మెషీన్ మీద పెట్టేస్తారు.

యంత్రానికి ‘జాగ్రత్త: గాజు వంగి ఉంటుంది.బీరు పూర్తిగా నిండే వరకు గ్లాసును ముట్టుకోవద్దు.’ అని ఒక హెచ్చరిక కూడా రాశారు.

ఆ వ్యక్తి హాయ్ చరిక ప్రకారమే నడుచుకుంటాడు.అప్పుడు మెషిన్( Beer Machine ) గాజు గ్లాస్‌లో బీరును నింపుతుంది.

ఇది బుడగలు రాకుండా గాజును రెండు కోణాల్లో వంచుతుంది.ఆపై, అది బీర్ పైన కొంత నురుగును జోడిస్తుంది.“జపాన్‌లో సెల్ఫ్-పోరింగ్ బీర్ మెషిన్( Self Pouring Beer Machine ) ఇది.చివర్లో పర్ఫెక్ట్ టచ్ ఇచ్చింది.నా ఉద్దేశ్యం అసలు జపాన్‌లో ఏది గొప్పది కాదు? ఈ రకమైన టెక్నాలజీ చూస్తుంటే మనం ఎంతో వెనుకబడినట్లు అనిపిస్తోంది.” అని ఈ వీడియో తీసిన వ్యక్తి ఒక క్యాప్షన్ రాశారు.

ఇంటర్నెట్‌లో ఈ వీడియోకు అనేక వ్యూస్, కామెంట్స్ వచ్చాయి.కొంతమంది మెషిన్ చాలా బాగా పనిచేస్తుందని పేర్కొన్నారు.మరికొందరు యంత్రం మంచిది కాదని, బీర్ చాలా తక్కువ పోసిందని, నురుగు చాలా ఎక్కువగా ఉందని కామెంట్లు చేశారు.బీరును బాగా పోయగల హ్యూమన్ బార్టెండర్‌ను తాము ప్రిఫర్ చేస్తామని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube