కిలీమంజారో పర్వతాన్ని అధిరోహించిన అనంతపూర్ 5వ తరగతి విద్యార్థి.. ప్రధాని అభినందించడంతో?

ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలు తమ టాలెంట్ తో సత్తా చాటుతూ ప్రశంసలతో పాటు విజయాలను సొంతం చేసుకుంటున్నారు.తాజాగా ఏపీ.

 Rage Surya Prasad Award Photos Goes Viral In Social Media Details Here ,rage Sur-TeluguStop.com

ఆర్.ఎస్.కొడిగెనహళ్లికి చెందిన బాలుడు రాగే సూర్యప్రసాద్( Rage Suryaprasad ) పీఎం చేతుల మీదుగా రాష్ట్రీయ బాలపురస్కార్ అవార్డ్ ను అందుకున్నారు.అనంతపురం జిల్లాకు చెందిన ఈ విద్యార్థి సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థి కిలి మంజారా( Kilimanjaro Mountain )తో పాటు దక్షిణ పుల్లు పర్వతాన్ని అధిరోహించారు.ఈ విషయం తెలిసిన కేంద్ర ప్రభుత్వం ఆ బాలుడిని ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డ్ కు ఎంపిక చేసింది.

Telugu Anantapur, Kilimanjaro, Pm Modi-Inspirational Storys

ఈ నెల 22వ తేదీన సూర్యప్రసాద్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం జరిగింది.ప్రధానమంత్రి మోదీ( PM Narendra Modi ) సూర్యప్రసాద్ తో పాటు ఈ అవార్డ్ కు ఎంపికైన ఇతర విద్యార్థులతో ముచ్చటించారు.చిన్న వయస్సులోనే ప్రతిభతో పురస్కారాలతో పాటు ప్రశంసలు అందుకుంటున్న సూర్యప్రసాద్ టాలెంట్ ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.సూర్యప్రసాద్ కు అవార్డ్ రావడం గురించి ఏపీ.ఆర్.ఎస్ ప్రిన్సిపాల్ మురళీధర్, ఇతర ఉపాధ్యాయులు స్పందిస్తూ సూర్యప్రసాద్ ను ప్రత్యేకంగా అభినందించడంతో పాటు తమకు చాలా సంతోషంగా ఉందంటూ ఆనందాన్ని వ్యక్తపరిచారు.

Telugu Anantapur, Kilimanjaro, Pm Modi-Inspirational Storys

సూర్యప్రసాద్ ను ప్రోత్సహించిన ఆ బాలుడి తల్లీదండ్రులను సైతం నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.సూర్యప్రసాద్ కు భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు దక్కాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సూర్యప్రసాద్ లాంటి టాలెంటెడ్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా( Social Media ) వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సూర్యప్రసాద్ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డ్ తీసుకుంటున్న ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube