ఫ్రెండ్స్‌తో డిన్నర్‌కి వెళ్లిన యువతికి చేదు అనుభవం.. ప్రజలకు ఆమె చెప్పే గుణపాఠం ఇదే..?

సాధారణంగా స్నేహితులతో కలిసి డిన్నర్ కి వెళ్ళినప్పుడు అందరూ సమానంగా బిల్లు షేర్ చేసుకోవాలి.కడుపునిండా తినేసి ఒకే స్నేహితుడు ఆ డబ్బునంత కట్టాలని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతే అసలు బాగోదు.

 A Young Woman Who Went To Dinner With Friends Had A Bitter Experience This Is Th-TeluguStop.com

అయితే ఒక యువతకి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది.గ్రూప్ డిన్నర్‌లలో బిల్లులను స్ప్లిట్ చేయడం గురించి ప్రజలను హెచ్చరించడానికి ఆమె టిక్‌టాక్‌లో ఓ వీడియోను షేర్ చేసింది.

స్టీక్‌హౌస్‌లో( steakhouse ) స్నేహితుడి పుట్టినరోజు పార్టీలో తనకు చేదు అనుభవం ఎదురైందని ఆమె చెప్పింది.చాలా తక్కువ డబ్బులతో సింగిల్ మదర్ గా బతుకునెట్టుకొస్తున్నానని కానీ స్నేహితుడికి తన స్తోమతకు తగిన ట్రీట్ ఇవ్వాలని భావించినట్లు వీడియో ప్రారంభంలో చెప్పుకొచ్చింది.

ఆమె వద్ద ఓ కూపన్‌ కూడా ఉందట, దానితో ఒక ఫుడ్‌ ధరకు ఆమెకు రెండు మీల్స్ లభిస్తాయి.దాంతో ఆమె 50 డాలర్ల స్టీక్‌ని ఆర్డర్ చేసింది, కానీ అది బాగోలేదు.

వెయిటర్ దాని కోసం ఆమె నుంచి వసూలు చేయనని చెప్పాడు.

Telugu Dinners, Mother, Tiktok-Latest News - Telugu

చివరికి ఆమె ఏమీ తినకుండా నీరు మాత్రమే తాగింది, అందువల్ల 25 డాలర్లు చెల్లిస్తే సరిపోతుందని అనుకుంది.కానీ వెయిటర్ ఇచ్చిన బిల్లు చూసేసరికి ఆమెకు కళ్ళు బైర్లు కమ్మాయి.ఈ బర్త్ డే పార్టీలో పాల్గొన్న కొంతమంది మనీ చెల్లించకుండా వెళ్లిపోయారు, మరికొందరు ఆమె 150 డాలర్లు( 150 dollars ) చెల్లించాలని కోరారు.

ఆమె బ్యాంకు అకౌంట్ లో సరిపడా డబ్బు లేదు.దీనివల్ల ఆమె బాగా ఒత్తిడికి లోనయింది.కార్డుతో 50 డాలర్లు, టిప్‌గా 10 డాలర్లు చెల్లించింది.మిగిలిన వాటి కోసం తన స్నేహితుడికి చెక్కు కూడా రాసింది.

Telugu Dinners, Mother, Tiktok-Latest News - Telugu

చాలా మంది ఆమె వీడియోను చూడగా వారిలో కొందరు ఆమెను నిందించారు.డబ్బు లేకపోతే తినడానికి బయటకు వెళ్లకూడదని చివాట్లు పెట్టారు.మరో వీడియో చేసి క్షమించండి అని ఆమె చెప్పింది.గుణపాఠాన్ని నేర్చుకున్నానని, ఆహారాన్ని ఆర్డర్ చేసే ముందు బిల్లును ఎలా విభజించాలనే దాని గురించి స్నేహితులతో తప్పకుండా ముందే మాట్లాడటం మంచిదని ఇతరులకు సలహా ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube