తెలుగు ప్రేక్షకులకు తమిళ హీరో విజయ్ దళపతి( Vijay Dalapathy ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.విజయ్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అయిన విషయం తెలిసిందే.
అలాగే కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించాడు విజయ్.ప్రస్తుతం ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.
సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు విజయ్.ఇక చివరిగా వచ్చిన లియో సినిమా( Leo Movie ) దాదాపుగా 630 కోట్ల కలెక్షన్స్ సాధించింది.
ఒకవైపు హీరోగా సినిమాలలో నటిస్తూనే మరొకవైపు తన అభిమానులకు సహాయం చేస్తూ గొప్ప మనసును చాటుకుంటూ ఉంటాడు విజయ్.

ఇటీవల తమిళనాడులో తుపాన్ వల్ల రోడ్డున పడిన పలు కుటుంబాలను ఆయన ఆదుకున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే విజయ్ వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని రోజులుగా కోలీవుడ్‌లో వార్తలు వస్తూనే ఉన్నాయి.రాబోయే ఎలక్షన్స్‌ల్లో తమళనాట తనొక రాజకీయ పార్టీని( Political Party ) స్థాపించి ఎన్నికల బరిలోకి దిగాలని చూస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ఆయన ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేస్తు ఉన్నాడు.దీంతో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ దాదాపు ఖాయం అని టాక్ ఉంది.కానీ విజయ్ రాజకీయ ఎంట్రీని ఆయన సతీమణి సంగీత( Sangeetha ) అడ్డుకుంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.అందుకే రాజకీయ పార్టీని ప్రకటించడంలో విజయ్ ఆలస్యం చేస్తున్నాడని టాక్ ఉంది.

రాజకీయాల్లోకి( Politics ) విజయ్ రావాలని కోరుకుంటున్నప్పటికీ ఆయన సతీమణి సంగీతతో పాటు వారి కుమారుడు జాసన్ సంఝా కూడా వ్యతిరేకిస్తున్నారట.విజయ్ రాజకీయ నిర్ణయాన్ని ఆయన భార్య, కుమారుడు వ్యతిరేకించడం వల్లే వారి మధ్య మనస్పర్థలకు ప్రధాన కారణమని తమిళ మీడియా పేర్కొంటుంది.రాజకీయాల్లోకి వస్తే వ్యక్తిగత జీవితం దెబ్బతింటుందని ఆమె అభిప్రాయపడుతుందట.కానీ విజయ్ మాత్రం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల్సిందేనని పట్టబట్టి ఉన్నారట.ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రచారం మాత్రం భారీగా జరుగుతుంది.







