వైసీపీ( YCP ) కీలక నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు.ఈ మేరకు వైవీ సుబ్బారెడ్డి( YV Subba Reddy ) చేసిన సవాల్ ను స్వీకరించినట్లు తెలిపారు.
జగన్ రెడ్డి అని పిలిస్తే వైసీపీ వాళ్లు ఫీల్ అవుతున్నారన్న షర్మిల జగన్ రెడ్డి అన్న పిలుపు ఇబ్బందిగా ఉంటే జగన్ అన్నా అని పిలుస్తానని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే వైసీపీ చేసిన అభివృద్ధి చూడటానికి తాను సిద్ధమని తెలిపారు.అభివృద్ధిని చూడటానికి తేదీ, సమయం వైసీపీ నేతలు చెప్పినా ఫర్వాలేదన్న షర్మిల( YS Sharmila ) తనను చెప్పమన్న చెబుతానని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో వైసీపీ కట్టిన రాజధాని, పోలవరం ఎక్కడ అని షర్మిల ప్రశ్నించారు.