యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) జాన్వీ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా( Devara Movie ) రిలీజ్ కు మరో 70 రోజుల సమయం మాత్రమే ఉంది.అయితే ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ తక్కువ డేట్స్ కేటాయించిందని ఈ సినిమాలో జాన్వీ కపూర్( Janhvi Kapoor ) కొంత సమయం మాత్రమే కనిపిస్తుందని సోషల్ మీడియా వేదికగా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే ఆ వార్తల గురించి టీమ్ నుంచి స్పష్టత వచ్చేసింది.
వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని దేవర సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు ఎక్కువగానే ప్రాధాన్యత ఉండనుందని క్లారిటీ వచ్చేసింది.జాన్వీ కపూర్ సైతం హీరోయిన్ గా నా తొలి సినిమా దేవర అని ఒక సందర్భంలో కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.బాలీవుడ్ నటీనటులు కూడా దేవరలో నటించడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
మరోవైపు ఈ సినిమా డిజిటల్ రైట్స్( Devara Digital Rights ) రికార్డ్ రేటుకు అమ్ముడయ్యాయి.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులకు గట్టి పోటీ ఉందని తెలుస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్( Mythri Movie Makers ) నిర్మాతలు ఈ సినిమా హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం అందుతోంది.దేవర సినిమాకు పోటీగా కొన్ని తమిళ సినిమాలు రిలీజవుతుండగా తెలుగు రాష్ట్రాల నుంచి దేవర సినిమాకు పోటీగా ఏ సినిమా అయినా విడుదలవుతుందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.ఏడాది క్రితమే దేవర మేకర్స్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు.
99 శాతం ఈ సినిమా రిలీజ్ డేట్ మారే చాన్స్ అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.దేవర నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా కోసం కొరటాల శివ( Koratala Siva ) పడుతున్న కష్టం అంతాఇంతా కాదని తెలుస్తోంది.ఈ సినిమా డైలాగ్స్ విషయంలో కొరటాల శివ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని భోగట్టా.