శాంతినగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం( Anantha Giri ) శాంతినగర్ వద్ద ఖమ్మం -కోదాడ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మరణించగా ఒకరికి గాయాలయ్యాయి.

 Two People Died In A Serious Road Accident In Shantinagar, Huzur Nagar, Anantha-TeluguStop.com

అనంతగిరి ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం హుజూర్ నగర్ ( Huzur Nagar )మండలం మాధవరేణిగూడెం గ్రామానికి చెందిన పుట్టపాక నర్సింహారావు, నాగరాణి(45),తన చెల్లెలు కొడుకు యశ్వంత్(10) ద్విచక్ర వాహనంపై ఖమ్మం ఫంక్షన్ కు వెళ్తుండగా శాంతినగర్ వద్దకు రాగానే వెనుక నుండి లారీ ఢీ కొట్టడంతో నాగరాణి, యశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందగా, నర్సింహారావుకు గాయాలయ్యాయి.

ఈ ఘటనపై లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు.

రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయని శాంతినగర్ గ్రామానికి చెందిన రాజుఅన్నారు.కోదాడ-ఖమ్మం జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయని,రోడ్డుకు ఇరుపక్కల సూచిక బోర్డులు లేక ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డుపై కంకర పడినా శుభ్రం చేయకుండా అలానే ఉంచడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

ఆర్ అండ్ బి అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేసి,వర్క్ జరిగే దగ్గర ప్రతిరోజు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube