శాంతినగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం( Anantha Giri ) శాంతినగర్ వద్ద ఖమ్మం -కోదాడ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మరణించగా ఒకరికి గాయాలయ్యాయి.అనంతగిరి ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం హుజూర్ నగర్ ( Huzur Nagar )మండలం మాధవరేణిగూడెం గ్రామానికి చెందిన పుట్టపాక నర్సింహారావు, నాగరాణి(45),తన చెల్లెలు కొడుకు యశ్వంత్(10) ద్విచక్ర వాహనంపై ఖమ్మం ఫంక్షన్ కు వెళ్తుండగా శాంతినగర్ వద్దకు రాగానే వెనుక నుండి లారీ ఢీ కొట్టడంతో నాగరాణి, యశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందగా, నర్సింహారావుకు గాయాలయ్యాయి.

ఈ ఘటనపై లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు.

రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయని శాంతినగర్ గ్రామానికి చెందిన రాజుఅన్నారు.

కోదాడ-ఖమ్మం జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయని,రోడ్డుకు ఇరుపక్కల సూచిక బోర్డులు లేక ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డుపై కంకర పడినా శుభ్రం చేయకుండా అలానే ఉంచడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

ఆర్ అండ్ బి అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేసి,వర్క్ జరిగే దగ్గర ప్రతిరోజు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

వావ్, ఆర్మీ వెహికల్‌ని హోటల్‌గా మార్చేశారు.. ఒక్క నైట్‌కి ఎంత ఛార్జ్ చేస్తారంటే…