తెలుగు సినిమా ఇండస్ట్రీని పాన్ ఇండియా రేంజ్ లోకి తీసుకెళ్ళిన డైరెక్టర్లలో రాజమౌళి( Rajamouli ) మొదటి స్థానంలో ఉంటే, ఆయన తర్వాత సుకుమార్,( Sukumar ) సందీప్ రెడ్డి వంగ,( Sandeep Reddy Vanga ) కోరటాల శివ( koratala Siva ) లాంటి దర్శకులు ఉన్నారు.ఇక వీళ్ళతో పాటు చందు మొండేటి( Chandoo Mondeti ) లాంటి ఒక యంగ్ డైరెక్టర్ కూడా కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండైరేంజ్ లో తన సత్తాను చాటుకున్నాడు.
ఇక ఇప్పుడు ఈ దర్శకులందరూ కలిసి తెలుగు సినిమా స్థాయిని పెంచే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.అందరూ కూడా భారీ సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ ని కూడా పాన్ ఇండియా( Pan India ) లెవెల్లో గర్వంగా చాటి చెబుతున్నారు.
ఇక ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీనే అనే విధంగా చాటి చెబుతూ సినిమాల మీద తన పూర్తి ఎఫర్ట్ పెడుతూ పాన్ ఇండియా రేంజ్ లో మన హీరోలను చూపించడమే కాకుండా ప్రేక్షకులందరిని కూడా అలరిస్తున్నారు.
![Telugu Chandoo Mondeti, Rajamouli, Sukumar, Karthikeya, Pan India, Sandeepreddy, Telugu Chandoo Mondeti, Rajamouli, Sukumar, Karthikeya, Pan India, Sandeepreddy,](https://telugustop.com/wp-content/uploads/2024/01/these-the-directors-who-raised-the-level-of-Telugu-cinema-rajamouli-sandeep-vanga-sukumar-detailsa.jpg)
ముఖ్యంగా బాలీవుడ్ లో ఉన్న జనాలను ఆకర్షించడం అంటే చాలా కష్టమైన పని అయినప్పటికీ మన దర్శకులు ఈజీగా వారిని అట్రాక్ట్ చేసుకుని అక్కడ మన సినిమాలను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు.ఇక దాంతో బాలీవుడ్ హీరోలు కూడా మన టాలీవుడ్ దర్శకుల కోసం ఎదురుచూస్తున్నారు.బాలీవుడ్ హీరోలు మన దర్శకులతో కనీసం ఒక్క సినిమా అయిన చేయాలనే కాన్సెప్ట్ తో ఉన్నట్టుగా తెలుస్తుంది.
![Telugu Chandoo Mondeti, Rajamouli, Sukumar, Karthikeya, Pan India, Sandeepreddy, Telugu Chandoo Mondeti, Rajamouli, Sukumar, Karthikeya, Pan India, Sandeepreddy,](https://telugustop.com/wp-content/uploads/2024/01/these-the-directors-who-raised-the-level-of-Telugu-cinema-rajamouli-sandeep-vanga-sukumar-detailsd.jpg)
అందుకే పలువురు హీరోలు మన దర్శకులతో కూడా కాంటాక్ట్ లో ఉంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ప్రస్తుతం మన తెలుగు డైరెక్టర్లు( Telugu Directors ) అందరూ కూడా బిజీగా ఉండడం వల్ల బాలీవుడ్ హీరోలకి తెలుగు డైరెక్టర్లు సినిమా చేయడానికి కమిట్ అవ్వడం లేదు.ఇక ఇప్పుడూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీనే అనే స్థాయికి మన ఇండస్ట్రీ ఎదిగిందనే చెప్పాలి…
.