తెలంగాణలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ( MLC candidates )నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.
ఈ క్రమంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు రెండు నామినేషన్లే రావడంతో ఏకగ్రీవం అయ్యాయి.ఎటువంటి ఎన్నికలు లేకుండానే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మహేశ్ కుమార్ గౌడ్ , బల్మూరి వెంకట్ ( Mahesh Kumar Goud ,Balmoor Venkat )నామినేషన్లను దాఖలు చేశారు.ఎన్నిక ఏకగ్రీవం కావడంతో వారిద్దరినీ తెలంగాణ అసెంబ్లీ కార్యాలయం ఎమ్మెల్సీలుగా ప్రకటించింది.ఈ మేరకు అసెంబ్లీ కార్యాలయం నుంచి రిటర్నింగ్ అధికారి నుంచి మహేశ్ కుమార్, బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ సర్టిఫికెట్లను అందుకోనున్నారు.