టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Hero Prabhas ) తాజాగా నటించిన చిత్రం సలార్.పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
ప్రశాంత్ నీల్( Prashant Neel ) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా జగపతి బాబు, శ్రీయా రెడ్డి, పృథ్వీరాజ్ సుకుమారన్ టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు తదితరులు నటించిన విషయం తెలిసిందే.గత ఏడాది డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

అయితే ఆరంభంలో భారీ స్పందన లభించిన సలార్ మూవీకి ఆ తర్వాత నుంచి మాత్రం దీనికి రెస్పాన్స్ క్రమంగా పడిపోతూనే వచింది.కానీ కలెక్షన్ల పరంగా మాత్రం పరవాలేదు అనిపించింది.ఇది ఇలా ఉంటే ప్రభాస్ బాహుబలి తర్వాత పలు సినిమాలలో నటించిన ఇప్పటికీ ఆ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.చాలా గ్యాప్ తర్వాత సలార్ సినిమా( Salaar Movie )తో ఒక సూపర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు ప్రభాస్.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

ఆ వీడియోలో ప్రభాస్ సలార్ సినిమాలో చెప్పిన డైలాగులు అన్నీ కూడా ఉన్నాయి.అయితే అంతా బాగానే ఉంది కానీ, ప్రభాస్ చెప్పిన డైలాగులు అన్నీ కలిపినా కూడా కనీసం రెండు నిమిషాలు కూడా కాకపోవడం ఆశ్చర్య పోవాల్సిన విషయం.ఈ వీడియో వైరల్ అవ్వడంతో ప్రభాస్ అభిమానులు కూడా ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.
కనీసం ఐదు నిమిషాలు కూడా సలార్ సినిమాలో ప్రభాస్ డైలాగులు లేకపోవడం ఆశ్చర్య పోవాల్సిన విషయం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.అన్ని చిన్న చిన్న డైలాగులే అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమా( Kalki Movie )లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది.
బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ త్వరలోనే మరొక కొత్త సినిమాతో ఒక ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.







