భారత్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్( India vs England ) మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ జనవరి 25న హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా ప్రారంభం అవుతుంది.అయితే భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇప్పటివరకు జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ బౌలర్లు ఎవరు చూద్దాం.
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో జేమ్స్ అండర్సన్( James Anderson ) అగ్రస్థానంలో ఉన్నాడు.ఇంగ్లాండ్ జట్టు ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కు టెస్ట్ క్రికెట్లో మంచి రికార్డు ఉంది.భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో 35 టెస్ట్ మ్యాచ్లు ఆడిన జేమ్స్ అండర్సన్ 24.89 బౌలింగ్ సగటుతో ఏకంగా 139 వికెట్లు తీశాడు.జేమ్స్ అండర్సన్ టెస్ట్ కెరీర్ లో మొత్తం ఏకంగా 690 వికెట్లు తీశాడు.

ఈ జాబితాలో రెండవ స్థానంలో భారత జట్టు మాజీ లెగ్ స్పిన్నర్ భగవత్ చంద్రశేఖర్( Bhagwat Chandrasekhar ) నిలిచాడు.భగవత్ చంద్రశేఖర్ ఇంగ్లాండ్ పై 23 టెస్టుల్లో 27.27 బౌలింగ్ సగటుతో 95 వికెట్లు తీశాడు.ఇంగ్లాండ్ తో జరిగిన ఒక మ్యాచ్ లో భగవత్ చంద్రశేఖర్ 107 పరుగులు ఇచ్చి ఏకంగా తొమ్మిది వికెట్లు సాధించి సరికొత్త రికార్డులు సృష్టించాడు.టెస్ట్ కెరియర్ పరంగా చూసుకుంటే 58 టెస్ట్ మ్యాచ్లు ఆడి 242 వికెట్లు తీశాడు.
ఈ జాబితాలో మూడవ స్థానంలో భారత జట్టు మాజీ దిగ్గజం అనిల్ కుంబ్లే( Anil Kumble ) నిలిచాడు.ఇంగ్లాండ్ పై 19 టెస్టుల్లో 30.59 బౌలింగ్ సగటుతో 92 వికెట్లు తీశాడు.

టెస్ట్ కెరియర్ చూసుకుంటే 132 టెస్టు మ్యాచ్లలో 619 వికెట్లు సాధించి అంతర్జాతీయ టాప్ బౌలర్లలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.ఈ జాబితాలో భారత జట్టు స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్( Ravichandran Ashwin ) నాలగవ స్థానంలో నిలిచాడు.రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్ పై 19 టెస్టుల్లో 28.59 బౌలింగ్ సగటుతో 88 వికెట్లు పడగొట్టాడు.టెస్ట్ కెరియర్ లో 95 టెస్టులలో 490 వికెట్లు పడగొట్టాడు.
భారత్ వేదికగా జరిగే భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో ఏఏ బౌలర్లు ఎన్ని వికెట్లు సాధించి రికార్డు సృష్టిస్తారో చూడాల్సి ఉంది.







