పన్నూ హత్య కుట్ర కేసు : నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించవచ్చు .. చెక్ రిపబ్లిక్ కోర్ట్ తీర్పు

ఖలిస్తాన్ వేర్పాటువాది , సిక్స్ ఫర్ జస్టిస్ వ్యవస్ధాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ ( Gurupatwant Singh Pannu )హత్యకు కుట్ర పన్నినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్న భారత్‌కు చెందిన 52 ఏళ్ల నిఖిల్ గుప్తాను( Nikhil Gupta ) అమెరికాకు అప్పగించవచ్చని చెక్ రిపబ్లిక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.చెక్ రిపబ్లిక్‌కు చెందిన మీడియా సంస్థ ‘‘ Seznam Zpravy ’’ ఈ మేరకు కథనాన్ని ప్రసారం చేసింది.

 Indian National Nikhil Gupta Accused Of Plotting To Kill Gurpatwant Pannun Can B-TeluguStop.com

అయితే గుప్తా అప్పగింతకు ఇంకా చెక్ న్యాయశాఖ మంత్రి పావెల్ బ్లేజెక్( Minister Pawel Blazek ) ఆమోదం అవసరమని పేర్కొంది.

ద్వైపాక్షిక యూఎస్ చెక్ అప్పగింత ఒప్పందం ఆధారంగా గతేడాది జూన్‌లో గుప్తాను ప్రేగ్‌లో అదుపులోకి తీసుకున్నారు.

చెక్ న్యూస్ వెబ్‌సైట్‌ కథనాల ప్రకారం.గుప్తా ప్రస్తుతం ప్రేగ్ పాంక్రాక్ జైలులో వున్నాడు .ప్రేగ్ హైకోర్టు క్లోజ్డ్ విచారణ సందర్భంగా ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది.పన్నూ గురించి ప్రస్తావిస్తూ.

గుప్తా తరపున న్యాయవాది పీటర్ స్లెపికా( Peter Slepika ) .ప్రేగ్ హైకోర్టులో తన వాదనను వినిపించారు.అతని ప్రకారం .గుప్తా భారతదేశ భద్రతకు ముప్పని, ఒసామా బిన్ లాడెన్‌తో పోల్చదగిన ప్రమాదకర వ్యక్తిగా వాదించారు.

Telugu Czech Website, Pawel Blazek, Nikhil Gupta, Peter Slepika, Vladimir Sepka-

పన్నూ కేసుకు రాజకీయ లేదా సైనిక నేపథ్యం వుందని గుప్తా తన వాదనలలో వాదించారు.అయితే ఇది రాజకీయపరమైన కేసు అనే డిఫెన్స్ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు.న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వ్లాదిమిర్ సెప్కా( Vladimir Sepka ) మాట్లాడుతూ.గుప్తా అప్పగింతకు సంబంధించి నిర్ణయం తీసుకునే ప్రక్రియకు ఎంత సమయం పడుతుందో తెలియదని వార్తాసంస్ధ నివేదించింది.

Telugu Czech Website, Pawel Blazek, Nikhil Gupta, Peter Slepika, Vladimir Sepka-

ఇదిలావుండగా.చెక్ రిపబ్లిక్‌లో కాన్సులర్ యాక్సెస్, చట్టపరమైన సహాయం సహా అప్పగింత ప్రక్రియ కోసం గుప్తా తరపున దాఖలు చేసిన పిటిషన్‌ను జనవరి 4న భారత సుప్రీంకోర్టు తిరస్కరించింది.జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం దీనిని సున్నితమైన అంశంగా పేర్కొంది.ఈ సమస్యపై జోక్యం చేసుకోవాలనుకుంటే కేంద్ర ప్రభుత్వ సూచన తప్పనిసరని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube