పులివెందుల ఈసారి టీడీపీదే..: చంద్రబాబు

కడప జిల్లా కమలాపురంలో టీడీపీ బహిరంగ సభ జరిగింది.సభలో పాల్గొన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

 Pulivendula Is Tdp This Time..: Chandrababu-TeluguStop.com

ఏపీలో రాబోయేది రైతు రాజ్యమని చంద్రబాబు అన్నారు.జగన్ పాలనలో అన్ని వర్గాలు నష్టపోయాయన్నారు.

రాష్ట్రంలో కేవలం సజ్జల, పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డికి మాత్రమే న్యాయం జరిగిందని చెప్పారు.రెడ్ల వలన ఎవరికైనా న్యాయం జరిగిందా అని ప్రశ్నించారు.

కులం పరిపాలన ఇవ్వదన్న చంద్రబాబు సమర్థవంతమైన పాలనే జీవితాల్లో వెలుగు తీసుకువస్తుందని పేర్కొన్నారు.ప్రజల్లో చైతన్యం లేకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందదని తెలిపారు.

ఒక్క ఛాన్స్ అని రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు.ఇకనైనా ప్రతి ఒక్కరికి లాభం జరగాలంటే వైసీపీ ప్రభుత్వం పోవాలని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube