మహేష్ రాజమౌళి కాంబినేషన్( Rajamouli ) లో ఒక సినిమా ఫిక్స్ కాగా ఈ సినిమా షూటింగ్ సమ్మర్ నుంచి మొదలుకానుంది.రాజమౌళి సినిమా అంటే ఎన్నో నియమనిబంధనలు ఉంటాయనే సంగతి తెలిసిందే.
జక్కన్నతో సినిమా కొరకు మహేష్ ( Mahesh babu )ఏకంగా ఎన్నో త్యాగాలు చేశారని సమాచారం అందుతోంది. 1500 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.

మహేష్ బాబు మూవీ షూటింగ్ మొదలైన తర్వాత ఎలాంటి లుక్ రివీల్ కాకుండా ఉండాలని రాజమౌళి మహేష్ కు షరతులు పెట్టారని సమాచారం అందుతోంది.తన సినిమా షూటింగ్ మొదలైన తర్వాత ఇతర సినిమాల షూటింగ్ లకు, యాడ్స్ కు సైతం దూరంగా ఉండాలని రాజమౌళి మహేష్ బాబుకు చెప్పారని తెలుస్తోంది.మహేష్ బాబు కొన్నేళ్ల పాటు విదేశాలకు కూడా వెళ్లే అవకాశాలు కూడా తక్కువని కామెంట్లు వినిపిస్తున్నాయి.మహేష్ సోషల్ మీడియా( Social media )లో యాక్టివ్ గా ఉన్నా సోషల్ మీడియాలో తన లుక్స్ కు సంబంధించిన ఎలాంటి ఫోటోలను షేర్ చేసే అవకాశం అయితే లేదని సమాచారం అందుతోంది.
సాధారణంగా మహేష్ బాబు లుక్ ను మార్చుకోవడానికి పెద్దగా ఇష్టపడరు.అయితే ఈ సినిమా కోసం మాత్రం వెరైటీ లుక్ ను ట్రై చేస్తున్నారని సమాచారం అందుతోంది.
మహేష్ బాబు లుక్ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉండబోతుందని సమాచారం అందుతోంది.తొలిసారి మహేష్ బాబు 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్( Remuneration ) ను అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.రాజమౌళి సినిమాతో మహేష్ బాబు రేంజ్ మారిపోయే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మహేష్ జక్కన్న కాంబో మూవీపై ఊహించని రేంజ్ లో అంతకంతకూ పెరుగుతున్నాయి.







