కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులులు మృతి చెందిన కేసులో నలుగురు అధికారులపై వేటు పడింది.కాగజ్ నగర్ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో రెండు పెద్దపులులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.
పులుల మృతిని అటవీశాఖ ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు.ఇందులో భాగంగా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఈ మేరకు ఎఫ్డీఓ, ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ మరియు బీట్ ఆఫీసర్ ను సస్పెండ్ చేశారు.కాగా పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది.
పులులు సంచరించే ప్రాంతంలో ఆక్రమణలు ఉన్న నేపథ్యంలో ఉన్నతాధికారులు హెచ్చరించినా పట్టించుకోలేదని అధికారులు పట్టించుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.







