అబ్బురపరిచే విజువల్స్ తో హృతిక్ 'ఫైటర్' ట్రైలర్.. మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్న ఏరియల్ యాక్షన్

లక్ష్య చిత్రంలో హృతిక్ రోషన్( Hrithik Roshan ) ఇండియన్ ఆర్మీ కెప్టెన్ గా మరచిపోలేని నటన కనబరిచారు.ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత హృతిక్ రోషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలెట్ గా ఫైటర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 Fighter Official Trailer ,hrithik Roshan, Deepika Padukone, Anil Kapoor, Siddhar-TeluguStop.com

సిద్ధార్థ్ ఆనంద్( Siddharth Anand ) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఫైటర్ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలై అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

టైలర్ లో హృతిక్ రోషన్ పాత్రని షంషేర్ పఠానియ అలియాస్ పాట్టిగా అభిమానులకు పరిచయం చేశారు.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్ డ్రాగన్స్ అనే స్పెషల్ టీమ్ కి లీడర్ గా హృతిక్ రోషన్ కనిపిస్తున్నాడు. 
ట్రైలర్( Fighter Trailer ) లో హృతిక్ రోషన్ పెర్ఫామెన్స్, చెబుతున్న డైలాగులు అభిమానుల్లో దేశభక్తిని రగిలించేలా ఉన్నాయి.యాక్టన్, ఎమోషన్ కలగలిపి హృతిక్ ఇస్తున్న పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటోంది.ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ లో హృతిక్ రోషన్ లుక్స్ సూపర్ స్టైలిష్ గా ఉన్నాయి.ఫైటర్ జెట్ పైలెట్ గా హృతిక్ చేస్తున్న యాక్షన్ సన్నివేశాలు ఊపిరి సలపని అనుభూతిని పంచుతున్నాయి. 

2019లో జరిగిన పుల్వామా అటాక్( Pulwama Attack ) నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అందుకు అనుగుణంగా హృతిక్ పాట్టి పాత్రని తీర్చిదిద్దారు.పుల్వామా అటాక్ సన్నివేశాలు.

దానికోసం తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ ఎంతో అద్భుతంగా ఉంటూ ప్రేక్షకుల హృదయాల్ని బలంగా తాకుతున్నాయి.సినిమా రిలీజ్ కి ఒక వెల్కమ్ సెలెబ్రేషన్స్ లాగా ట్రైలర్ ని నెటిజన్లు సెలెబ్రేట్ చేస్తున్నారు.

ఇండియా 75వ రిపబ్లిక్ డే సందర్భంగా ఒకరు రోజు ముందే అంటే జనవరి 25న ఫైటర్ చిత్రం రిలీజ్ అవుతోంది.హృతిక్ రోషన్ నుంచి వస్తున్న తొలి 3డీ చిత్రం ఇదే.ఫైటర్ మూవీని 3డీ ఐమాక్స్ ఫార్మాట్ లో రూపొందించారు. 

వార్, బ్యాంగ్ బ్యాంగ్ తర్వాత హృతిక్ రోషన్ , సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇదే.సిద్దార్థ్ ఆనంద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.నెవర్ బిఫోర్ అనిపించే సినిమాటిక్ అనుభూతిని అందిస్తానని కూడా ఆడియన్స్ కి ప్రామిస్ చేశారు.

ఫైటర్ చిత్రం ఏరియల్ యాక్షన్ లో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రంగా ఆసక్తిని పెంచుతోంది.ఫైటర్ ట్రైలర్ విడుదల సందర్భంగా హీరో హృతిక్ రోషన్ ప్రేక్షకులకు అభిమానులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube