ఓపెన్ పోర్స్ తో వర్రీ వద్దు.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే వదిలించుకోండిలా!

ఓపెన్ పోర్స్.( Open Pores ) చాలా మందిని క‌ల‌వ‌ర పెట్టే చర్మ సమస్యల్లో ఒకటి.

 Wonderful Home Remedy To Get Rid Of Open Pores Details! Home Remedy, Open Pores,-TeluguStop.com

మొటిమలు, మచ్చలు వంటి వాటిని మేకప్ తో కవర్ చేయగలుగుతారు.కానీ ఓపెన్ పోర్స్ ను ఏ మేకప్ ( Makeup ) కూడా కవర్ చేయలేదు.

పైగా తెరిచి ఉన్న చర్మ రంధ్రాల్లోకి దుమ్ము ధూళి చేరుకుంటుంది.ఫలితంగా మరిన్ని చర్మ సమస్యలు వస్తుంటాయి.

ఈ క్రమంలోనే ఓపెన్ పోర్స్ సమస్యను వదిలించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.రకరకాల క్రీములు, సీరం లను కొనుగోలు చేసి వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.

కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఓపెన్ పోర్స్ ను వదిలించుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ రెమెడీ మీకు గ్రేట్ గా సహాయపడుతుంది.

మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక నిమ్మ పండును( Lemon ) తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలు మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Telugu Tips, Face Pack, Healthy Skin, Remedy, Latest, Lemon, Multhani Mitti, Raw

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి,( Multhani Mitti ) పావు టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు,( Organic Turmeric ) వన్ టేబుల్ స్పూన్ పచ్చి పాలు( Raw Milk ) వేసుకుని కలుపుకోవాలి.చివరిగా సరిపడా లెమన్ జ్యూస్ వేసి అన్నీ కలిసేలా మరోసారి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

Telugu Tips, Face Pack, Healthy Skin, Remedy, Latest, Lemon, Multhani Mitti, Raw

ఆపై చర్మాన్ని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే ఓపెన్ పోర్స్ సమస్య క్రమంగా దూరమవుతుంది.చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించి.ఓపెన్ పోర్స్ ను క్లోజ్ చేయడానికి ఈ హోమ్ రెమెడీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.కాబట్టి ఓపెన్ పోర్స్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube