ఓపెన్ పోర్స్ తో వర్రీ వద్దు.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే వదిలించుకోండిలా!
TeluguStop.com
ఓపెన్ పోర్స్.( Open Pores ) చాలా మందిని కలవర పెట్టే చర్మ సమస్యల్లో ఒకటి.
మొటిమలు, మచ్చలు వంటి వాటిని మేకప్ తో కవర్ చేయగలుగుతారు.కానీ ఓపెన్ పోర్స్ ను ఏ మేకప్ ( Makeup ) కూడా కవర్ చేయలేదు.
పైగా తెరిచి ఉన్న చర్మ రంధ్రాల్లోకి దుమ్ము ధూళి చేరుకుంటుంది.ఫలితంగా మరిన్ని చర్మ సమస్యలు వస్తుంటాయి.
ఈ క్రమంలోనే ఓపెన్ పోర్స్ సమస్యను వదిలించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.రకరకాల క్రీములు, సీరం లను కొనుగోలు చేసి వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.
కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఓపెన్ పోర్స్ ను వదిలించుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ రెమెడీ మీకు గ్రేట్ గా సహాయపడుతుంది.
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక నిమ్మ పండును( Lemon ) తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలు మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
"""/" /
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి,( Multhani Mitti ) పావు టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు,( Organic Turmeric ) వన్ టేబుల్ స్పూన్ పచ్చి పాలు( Raw Milk ) వేసుకుని కలుపుకోవాలి.
చివరిగా సరిపడా లెమన్ జ్యూస్ వేసి అన్నీ కలిసేలా మరోసారి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
"""/" /
ఆపై చర్మాన్ని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే ఓపెన్ పోర్స్ సమస్య క్రమంగా దూరమవుతుంది.
చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించి.ఓపెన్ పోర్స్ ను క్లోజ్ చేయడానికి ఈ హోమ్ రెమెడీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
కాబట్టి ఓపెన్ పోర్స్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.
చిరంజీవితో సినిమా చేయాలంటే ఈ ఆస్థాన రచయితల సలహాలు కూడా తీసుకోవాల్సిందే…