రాజాసాబ్ గా రాబోతున్న ప్రభాస్... వైరల్ అవుతున్న వీడియో!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) ప్రస్తుతం వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇటీవల సలార్ ( Salaar ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ప్రభాస్ ప్రస్తుతం ఇతర సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

 Prabhas Rajasaab First Look Viral In Social Media , Prabhas, Rajasaab, Maruthi,-TeluguStop.com

ఇక ఈ ఏడాది మేలో ఈయన నటిస్తున్నటువంటి కల్కి( Kalki ) సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.అదేవిధంగా సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమా, సలార్ పార్ట్ 2, మారుతి ( Maruthi ) డైరెక్షన్లో కూడా ప్రభాస్ సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.

అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మారుతి డైరెక్షన్లో రాబోతున్నటువంటి సినిమాకు టైటిల్ అనౌన్స్ చేశారు.

ఇప్పటివరకు ఈ సినిమాకు ఎన్నో రకాల టైటిల్స్ తెరపైకి వచ్చాయి.కానీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రభాస్ మారుతి కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమాకు రాజా సాబ్ ( Rajasaab ) అనే టైటిల్స్ పెడుతున్నట్టు మేకర్స్ అధికారికంగా ఒక వీడియో ద్వారా తెలియజేశారు.అయితే ఈ వీడియోలో ప్రభాస్ లుక్ చూస్తే కనుక చాలా భిన్నంగా ఉందని చెప్పాలి.

ఈ వీడియోలో ప్రభాస్ లుంగీ కట్టుకొని సరికొత్త లుక్ లో కనిపించారు.డైనోసార్ ఇన్ డార్లింగ్ అవతార్ అంటూ ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోని విడుదల చేశారు.ఇక ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇందులో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే వీటన్నిటి గురించి కూడా త్వరలోనే అన్ని విషయాలను తెలియచేయనున్నారు.

ఇక ఈ వీడియోలో ప్రభాస్ లుక్ చూసి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube