వైసీపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది.టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఫొటోపై ఆయన చేసిన కామెంట్ పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయని తెలుస్తోంది.
మందడంలో జరిగిన భోగి వేడుకల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ గంగిరెద్దు పక్కన నిలబడి ఫొటో దిగిన సంగతి తెలిసిందే.దీన్ని ఇరు పార్టీ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దాన్ని మంత్రి అంబటి రాంబాబు షేర్ చేశారు.
అదేవిధంగా ట్వీట్ లో బాబు పక్కన రెండు గంగిరెద్దులు అంటూ కామెంట్ చేశారు.ఈ క్రమంలో మంత్రి అంబటి షేర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.