యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి( Sri Lakshmi Narasimha Swamy ) ప్రసాదానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ఎఫ్ఎస్ఎస్ఏఐ నేషనల్ ఫుడ్ సేఫ్టీ సీఈఓ ఐపీఎస్ కమల్ వర్ధన్ రావు వెల్లడించారు.శనివారం యాదాద్రి క్షేత్రాన్ని ఆయన సందర్శించి నేషనల్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు జారీ చేసిన జాతీయ సర్టిఫికెట్ ‘భోగ్’ – బ్లిస్ ఫుల్ హైజీన్‘ పత్రాన్ని ఆలయ ఏఈఓ రామ్మోహన్ రావు( AEO Rammohan Rao )కు అందజేశారు.







