ప్రస్తుత సీజన్ లో విపరీతమైన చలి కారణంగా మన చర్మం సున్నితత్వాన్ని కోల్పోతుంది.ఫలితంగా స్కిన్ డ్రై( Dry skin )గా మరియు రఫ్ గా తయారవుతుంది.
ఇటువంటి చర్మాన్ని రిపేర్ చేసుకునేందుకు ఖరీదైన మాయిశ్చరైజర్, సీరం వంటి ఉత్పత్తులను వాడుతుంటారు.కానీ చర్మం పై వాటి ప్రభావం కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది.
కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే చలికాలంలో చర్మాన్ని సహజంగానే తేమగా మెరిపించుకోవచ్చు.డ్రై మరియు రఫ్ స్కిన్ కు ఎల్లప్పుడూ దూరంగా ఉండవచ్చు.
మరి ఇంతకీ ఆ సింపుల్ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు( Dates ) వేసి కొద్దిగా వాటర్ పోసి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న ఖర్జూరం ను వేసుకోవాలి.అలాగే పీల్ తొలగించిన నాలుగు బొప్పాయి పండు( Papaya ) ముక్కలు మరియు రెండు స్పూన్లు రోజ్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ పెరుగు మీగడ, హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆ తర్వాత చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

కనీసం ఐదు నిమిషాలైనా మసాజ్ చేసుకుని అప్పుడు తడి క్లాత్ తో శుభ్రం చేసుకోవాలి.చలికాలంలో ఈ సింపుల్ చిట్కాను రోజుకు ఒకసారి కనుక పాటిస్తే చర్మం డ్రైగా మారడం, రఫ్ గా తయారవటం వంటి సమస్యలేవీ ఉండవు.మీ స్కిన్ ఎల్లప్పుడూ తేమగా మరియు కాంతివంతంగా మెరిసిపోతుంది.
ఖర్జూరం, బొప్పాయి లో ఉండే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి.అదే సమయంలో స్కిన్ స్మూత్ గా షైనీ గా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.







