టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ లలో ప్రభాస్ మారుతి కాంబో మూవీ ఒకటి.టాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లలో ఈ సినిమా కూడా ఒకటి కాగా ఈ సినిమాకు రాజా డీలక్స్ ( Raja Deluxe )అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని వార్తలు వినిపించాయి.
అయితే ఈ టైటిల్ ను స్వల్పంగా మార్చారని రాజా డీలక్స్ రాజా సాబ్ గా మారిందని సమాచారం అందుతుండటం గమనార్హం.
ఈ సినిమా హర్రర్ కథాంశంతో తెరకెక్కుతోందని ప్రభాస్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.
ఈ నెల 14వ తేదీన ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ రివీల్ కానుందని సమాచారం అందుతోంది.ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉందని తెలుస్తోంది.
ప్రభాస్ మారుతి మూవీ పాన్ ఇండియా మూవీగా ఇతర భాషల్లో విడుదల కానుందని సమాచారం అందుతోంది.ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

మారుతి గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించకపోవడంతో పాటు నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే.అయితే ప్రభాస్ మాత్రం మారుతిని నమ్మి ఛాన్స్ ఇవ్వగా మారుతి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారేమో చూడాల్సి ఉంది. కల్కి 2898 ఏడీ మూవీ( Kalki 2898 AD Movie ) ఈ ఏడాది మే నెల 9వ తేదీన రిలీజ్ కానుండగా ప్రభాస్ మారుతి మూవీ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రభాస్ గత సినిమా సలార్ నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందించగా ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు సైతం భారీ స్థాయిలో లాభాలను అందించడం ఖాయమని తేలిపోయింది.ప్రభాస్ తో సినిమాలను నిర్మించడానికి పోటీ పడుతున్న నిర్మాతల సంఖ్య పెరుగుతోంది.ప్రభాస్ తో సినిమాలను తెరకెక్కించడానికి చాలామంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు.







