ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గెలుపే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తుంది.ఇందులో భాగంగా ఇప్పటికే పలు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల ఇంఛార్జులను మారుస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే మొదటి విడతలో పదకొండు స్థానాలు, రెండో విడతలో 27 స్థానాలు, మూడో విడతలో 21 స్థానాలతో మొత్తం మొత్తం 59 స్థానాల్లో నియోజకవర్గ ఇంఛార్జులను మార్చింది.వీటిలో 50 అసెంబ్లీ స్థానాలుండగా 9 ఎంపీ స్థానాలు ఉన్నాయి.
ఈ క్రమంలో ముగ్గురు ఎంపీలను ఔట్ చేసిన వైసీపీ 23 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈ సారి ఛాన్స్ నిరాకరించింది.
మూడో జాబితాలో భాగంగా విశాఖ పార్లమెంట్ స్థానం ఇన్‌ఛార్జిగా మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ, శ్రీకాకుళం పార్లమెంట్ ఇన్‌ఛార్జిగా పేరాడ తిలక్, విజయవాడ పార్లమెంట్ స్థానం ఇన్‌ఛార్జిగా కేశినేని నాని, తిరుపతి పార్లమెంట్ స్థానం ఇన్‌ఛార్జిగా కోనేటి ఆదిమూలం, కర్నూలు పార్లమెంట్ ఇన్‌ఛార్జిగా మంత్రి గుమ్మనూరు జయరాం, ఏలూరు పార్లమెంట్ ఇన్‌ఛార్జిగా కారుమూరు సునీల్ కుమార్ ను నియమిస్తూ వైసీపీ లిస్ట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.







