టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు మహేష్ బాబు(Mahesh Babu) ఒకరు ఈయన కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక ఇండస్ట్రీలో మహేష్ బాబు హీరోగా కొనసాగడమే కాకుండా వ్యాపార రంగంలో (Business) కూడా ఈయన దూసుకుపోతున్న సంగతి మనకు తెలిసిందే.
ఈయనకు రెస్టారెంట్స్ అలాగే థియేటర్ బిజినెస్ లో ఉన్నాయి హైదరాబాదులో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి ఏఎంబి సినిమాస్ (AMB Cinemas) ద్వారా మహేష్ బాబు భారీ లాభాలను అందుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఏషియన్ వారితో కలిసి హైదరాబాద్లో రెస్టారెంట్ కూడా ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే.ఇలా హైదరాబాద్ బంజారాహిల్స్ లో AN ప్యాలస్ హైట్స్ (AN Palace Heights) అనే పేరు తో నడుస్తున్న ఈ రెస్టారంట్ ఇప్పుడు బంజారా హిల్స్ లో ఒక బ్రాండెడ్ రెస్టారంట్ అయిపోయింది.ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచిన ఈ రెస్టారెంట్లో మనం ఒక పూట టిఫిన్ చేయాలి అంటే సుమారు 500 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది అంతా రిచ్ గా ఈ రెస్టారెంట్ నడుస్తోందని చెప్పాలి.

ఇలా ఈ రెస్టారెంట్లో ఒక ప్లేట్ ఇడ్లీ లేదా దోశ తినాలి అంటే మనం 500 నుంచి 600 రూపాయలు వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.ధరలు భారీగానే ఉన్నప్పటికీ ఎంతోమంది ఈ రెస్టారెంట్ కు వెళ్లి అక్కడ ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేస్తూ ఉంటారు.ఇలా ఎంతో రిచ్ గా నడుస్తున్నటువంటి ఈ రెస్టారెంట్ భారీ స్థాయిలో బిజినెస్ జరుపుకుంటుందని తెలుస్తుంది.ఒక రోజుకు సుమారు 8 నుంచి 10 లక్షల రూపాయల వరకు బిజినెస్ జరుగుతోందని ఈ డబ్బుతో ఒక సామాన్య జీవితం గడిపే వ్యక్తి బిందాస్ గా ఇల్లు కట్టుకోవచ్చని భావిస్తున్నారు.
ఈ విధంగా మహేష్ బాబు కేవలం సినిమాలలోనే కాదు వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్నారని అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







