ఏపీలో చిరువ్యాపారులకు జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది.ఈ మేరకు జగనన్న తోడు పథకం కింద ఏపీ సీఎం జగన్ లబ్దిదారులకు డబ్బులు జమ చేశారు.
ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున వడ్డీలేని రుణంను సీఎం జగన్ బటన్ నొక్కి నగదు జమ చేశారు.చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, చేతివృత్తుల వారికి జగనన్న తోడు పథకం కింద నిధులు విడుదల చేశారు.సుమారు 3.95 లక్షల మంది ఖాతాల్లో రూ.417 కోట్ల వడ్డీలేని రుణాలు జమ అయ్యాయి.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ చిరు వ్యాపారుల కోసమే జగనన్న తోడు పథకాన్ని తీసుకువచ్చామని తెలిపారు.సకాలంలో కడితే వడ్డీ భారం కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
చిరు వ్యాపారులను ఆదుకోవడంలో దేశానికే ఏపీ ఆదర్శమని పేర్కొన్నారు.మన ప్రభుత్వం మానవత్వానికి మారుపేరుగా నిలబడిందని తెలిపారు.ఇప్పటివరకు 16.73 లక్షల మందికి రూ.3,373 కోట్ల లబ్ధి చేకూరింది.ఈ పథకంతో నాలుగు సార్లు చిరు వ్యాపారులు లబ్ది పొందారన్నారు.
అలాగే ఈ పథకంలో భాగంగా లబ్ధిపొందుతున్న వారిలో 87 శాతం మహిళలే ఉన్నారని సీఎం జగన్ వెల్లడించారు.సామాజిక సాధికారతకు ఇదొక నిదర్శనమని తెలిపారు.