సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణంలోని తేజ విద్యాలయ విద్యార్థులకు గురువారం సోలార్ బస్సుపై అవగాహన ప్రదర్శన నిర్వహించారు.సాంప్రదాయేతర ఇంధన వనరుల మీద అవగాహన కలిపించడం కోసం ఢిల్లీ ఐఐటి పనిచేస్తున్న ఆచార్య చేతన్ సింగ్ సోలంకి ఎనర్జీ స్వరాజ్ యాత్ర (2020-2030) చేపట్టారు.
దేశ వ్యాప్తంగా ఈ బస్సులో ప్రయాణిస్తూ సాంప్రదాయేతర ఇంధనమైన సౌరశక్తి మీద అవగాహన కల్పిస్తున్నారు.ఇందులో భాగంగా గురువారం కోదాడ తేజ విద్యాలయంలో మేనేజర్ అభిషేక్ సౌర శక్తితో నడిచే సౌర బస్సును విద్యార్థులకు చూపించి, అవగాహన కలిపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ అంతా సాంప్రదాయ ఇంధన వనరులదేనని, అందులో సౌరశక్తి చాలా చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు.పాఠశాల పరిశోధన మరియు అభివృద్ధి నిర్వాహకుడు కిషోర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.
భౌతిక శాస్త్ర అధ్యాపకులు షేక్ ఉస్మాన్ మరియు విజయసాగర్ పిల్లలకు వివరించారు.ఇటువంటి పరిశోధనలను విద్యార్థులకు చూపించడం ద్వారా వారికి పర్యావరణ అనుకూల శక్తివనరుల పట్ల అవగాహన కల్పించవచ్చని ప్రిన్సిపల్ రమా సోమిరెడ్డి అన్నారు.