2023 సంవత్సరంలో నాని( Nani ) దసరా, హాయ్ నాన్న అనే రెండు సినిమాలు చేశాడు.ఈ రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ లను సాధించాయి.
ఇక ఈ సినిమాలు సక్సెస్ అందుకోవడంతో నాని పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో మారుమ్రోగుతుంది.ఇక ఇలాంటి క్రమం లో ఈయన చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకుంటాయనే ఉద్దేశ్యం లో దర్శక నిర్మాతలు అందరూ నాని వెంటపడుతున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే నాని కూడా తనదైన రీతిలో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నాడు.ఇక ఇప్పటికే నాని బలగం వేణు తో( Balagam Venu ) ఒక సినిమా చేయడానికి కమిట్ అయినప్పటికీ ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఇది ఇలా ఉంటే మరో కొత్త డైరెక్టర్ చెప్పిన కథ నాని కి బాగా నచ్చడంతో ఆయనతో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు అని తెలుస్తుంది.

అయితే ఇది ఆర్మీ బేస్డ్ గా సాగే కథగా తెలుస్తుంది.మరి ఈ సినిమాతో నాని ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఒకవేళ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ కనక సాధించినట్టయితే నాని తన కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ కొట్టబోతున్నాడని తెలుస్తుంది.

ఇక ఇప్పటివరకు నాని ఆర్మీ జవాన్ గా( Army Soldier ) ఒక్క సినిమాలో కూడా చేయలేదు అందువల్ల ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ అనేది చాలా బాగా ఉంటుందని ప్రేక్షకులను కూడా అలరిస్తుందని చాలామంది వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.మరి నాని ఈ సినిమాతో ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇది ఇలా ఉంటే నాని ఎందుకు కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తున్నాడు అంటూ మిగితా హీరోలు అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు…
.







