పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పవన్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఓజీ మూవీ( OG Movie ) బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని అటు పవన్ కు ఇటు సుజీత్ కు ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఓజీ గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచగా ఈ సినిమా కర్ణాటక రైట్స్( Karnataka Rights ) ఏకంగా 20 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ కు( Pawan Kalyan ) ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్లే ఆయన సినిమాల హక్కులు ఈ రేంజ్ లో అమ్ముడయ్యాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలకు దూరంగా ఉన్నా ఆయన రేంజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.సినిమా సినిమాకు పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
సరికొత్త కథాంశాలను ఎంచుకుంటూ పవన్ ఫ్యాన్స్ కు దగ్గరవుతున్నారు.
పవన్ ఓజీ చేతులు మారుతోందని పీపుల్స్ మీడియా నిర్మాతలు ఈ సినిమాను సొంతం చేసుకున్నారని వార్తలు వినిపించినా ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా.ఓజీ సినిమాలో కళ్లు చెదిరే యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని ఈ సినిమా ట్రెండ్ సెట్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.శ్రియారెడ్డి,( Sriya Reddy ) వెంకట్( Venkat ) ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండటం గమనార్హం.
పొలిటికల్ కార్యక్రమాల వల్ల పవన్ ప్రస్తుతం షూటింగ్ లకు దూరంగా ఉన్నారు.ఏపీలో ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల షూటింగ్ లను పవన్ మొదలుపెట్టే ఛాన్స్ అయితే ఉంది.పవన్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.